డైరెక్టర్ గా మారిన రాహుల్ రవీంద్రన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కింగ్ నాగార్జున..

396

అందాల రాక్షసి చిత్రంతో తెలుగులో హీరోగా పరిచయం అయిన రాహుల్ రవీంద్రన్ సడెన్ గా డైరెక్టర్ అవతారం ఎత్తాడు.హీరోగా పలు చిత్రాలు చేసిన సక్సెస్ రాలేదు.అందుకే దర్శకుడిగా మారాడు.ఇటివలే విడుదలై మంచి విజయం సాదించిన చిలసౌ చిత్రానికి రాహుల్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

హీరో సుశాంత్ కు ఈ చిత్రం బ్రేక్ ఇచ్చిందని చెప్పొచ్చు.సుశాంత్ కు జోడిగా రుహాని శర్మ నటించింది. ఎవరూ ఊహించని విధంగా చిలసౌ చిత్రం విజయం సాధించడంతో రాహుల్ క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు.చిలసౌ చిత్రాన్ని రాహుల్ మొదటి నుంచి ధీమాతో తెరకెక్కించాడు.రాహుల్ ప్రతిభకు కింగ్ నాగార్జున ఆశ్చర్యపోయినట్లు తెలుస్తోంది.

వెంటనే తమ బ్యానర్ అన్నపూర్ణ సుడియోస్ లోనే మరో రెండు చిత్రాలకు రాహుల్ ని నాగార్జున ఒప్పించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు రాహుల్ కి 25 లక్షల అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు చెబుతున్నారు.రాహుల్ నెక్స్ట్ మూవీ అక్కినేని హీరోతో ఉంటుందా లేక వేరే హీరోతో ఉంటుందా అన్న విషయం తెలియాలంటే రాహుల్ ప్రకటించే వరకు ఆగాల్సిందే.