ధ‌నుష్ తో నాగార్జున కొత్త ప్రాజెక్ట్

396

కింగ్ నాగార్జున ఆఫీస‌ర్ సినిమా అనుకున్నంత స‌క్సెస్ ని ఆయ‌న‌కు ఇవ్వ‌లేక‌పోయింది.. ఆర్జీవీ మ‌రో హిట్ నాగ్ కు ఇస్తారు అని భావించారు.. కాని ఆయ‌నకు హిట్ అంద‌లేదు.. ఇక కింగ్ నాగార్జున ప్ర‌స్తుతం నాని తో కలిసి దేవదాస్ అనే మ‌ల్టీస్టార‌ర్ సినిమాలో న‌టిస్తున్నారు… ఈ సినిమా పై ఇద్ద‌రూ మంచి హోప్స్ పెట్టుకున్నారు. ఇటు నాని కూడా మ‌ల్టీస్టార‌ర్ లో త‌న ల‌క్ చూసుకోవాలి అని భావిస్తున్నాడు.

Image result for dahnush and nagarjunaఈ సినిమాని భ‌లే మంచి రోజు చిత్ర డైరెక్ట‌ర్ శ్రీరామ్ ఆదిత్య తెర‌కెక్కిస్తున్నారు.. ఇక ఈ సినిమా షూటింగ్ ఫైన‌ల్ కు చేరుకుంది. ఈ సినిమాని సెప్టెంబ‌ర్ 27న విడుద‌ల చేయాల‌ని చూస్తున్నారు.. ఈ సినిమాతో పాటు నాగార్జున బాలీవుడ్ లో బిగ్ బీ అమితాబ్ తో క‌లిసి బ్ర‌హ్మ‌స్త్ర సినిమాలో న‌టిస్తున్నారు.. ఆయ‌న ఇందులో ఓ ప్ర‌ముఖ పాత్ర‌లో న‌టిస్తున్నారు అని తెలుస్తోంది.. ఇటీవ‌ల ఈ సినిమా షూటింగ్ లో కూడా ఆయ‌న పాల్గొన్నారు.

Image result for dahnush and nagarjuna

ఇక నాగార్జున తాజాగా ఈ రెండు సినిమాల‌లోనే న‌టిస్తున్నారు.. కొత్త సినిమాలు ఆయ‌న ఏమీ సెట్స్ పై పెట్ట‌లేదు.. అలాగే డిస్క‌స్ చేయ‌లేదు ఇక మ‌రో వార్త ఇప్పుడు నాగ్ గురించి ఇటు కోలీవుడ్ టాలీవుడ్ లో వినిపిస్తోంది…నాగార్జున కోలీవుడ్ లో ధ‌నుష్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌డానికి రెడీ అయ్యారు అని తెలుస్తోంది.. గ‌తంలోనే ఈ సినిమా పై వార్త‌లు వ‌చ్చినా దీనిపై ప్ర‌క‌న‌ట రాలేదు ఇప్ప‌డు మ‌ళ్లీ చర్చ‌ల్లోకి ఈ వార్త‌లు రావ‌డంతో ఇది క‌రెక్ట్ అని అంటున్నారు.