తాత కాబోతున్న నాగార్జున సంతోషంలో అక్కినేని అభిమానులు

596

అక్కినేని వార‌సులు ఇప్పుడు సినిమాల్లో మూడోత‌రం అల‌రిస్తున్నారు నాగార్జున కూడాత‌న కుమారుల‌తో పోటీగా సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో ఓ వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది…కింగ్ నాగార్జున త్వరలో తాత కాబోతున్నారు. అయితే అది రియల్‌ లైఫ్‌లో మాత్రం కాదు.. రీల్ లైఫ్‌లోనే. అవును నాగార్జున తన తదుపరి చిత్రంలో తాత పాత్రలో కనిపించనున్నాడట. దేవదాసు సినిమా తరువాత తెలుగు సినిమాలకు గ్యాప్‌ ఇచ్చిన నాగ్‌, బాలీవుడ్ సినిమా బ్రహ్మాస్త్రతో పాటు మరో మలయాళం సినిమాలో నటిస్తున్నారు. తమిళ్‌లో ధనుష్‌ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభమైనా ఇంకా పట్టాలెక్కలేదు. ఇక టాలీవుడ్ లో ప‌లువురు ద‌ర్శ‌కులు ఆయ‌న‌తో సినిమాలు చేసేందుకు ఇప్ప‌టికే క‌థ‌లు సిద్దం చేస్తున్నారు అయితే ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా నాగార్జున ప‌లు క‌థ‌లు కూడా వింటున్నార‌ట‌.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

తాజాగా సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు ప్రీక్వల్‌ను మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నాడు నాగ్‌. కల్యాణ్ కృష్ణ చెప్పిన కథ నచ్చటంతో ఏప్రిల్‌ లోనే సినిమాను ప్రారంభించే ఆలోచనలో ఉన్నాడట. ఈ సినిమాలో నాగ్‌తో పాటు నాగచైతన్య కూడా నటించనున్నాడన్న టాక్‌ వినిపిస్తోంది. అంతేకాదు నాగార్జున, నాగచైతన్య కే తాతగా కనిపించనున్నాడట. బంగార్రాజు అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే క‌థ పూర్తి అయింది అని ఇందులో నాగార్జున నాగ‌చైత‌న్య పాత్ర‌లు సినిమాకి హైలెట్ గా ఉంటాయి అని చెబుతున్నారు కొంద‌రు, ఇక సోగ్గాడే చిన్నినాయ‌న చిత్రం ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే, ఆ త‌ర్వాతే ఈ సినిమా సీక్వెల్ చేయాలి అని భావించారు నాగ్.. మ‌రి చూడాలి ఈ సీక్వెల్ ఎలా ఉంటుందో. మ‌రి నాగ్ సినిమా పై మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.