కోడలికి సవాల్ విసిరిన అక్కినేని నాగార్జున…

482

తెలంగాణ హరితహారంలో భాగంగా చేపట్టిన ‘గ్రీన్‌ ఛాలెంజ్’కార్యక్రమం ఉద్యమంలా సాగుతోంది.సోషల్ మీడియాలో కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోంది. ఈ కార్యక్రమానికి మద్దతుగా పలువురు సెలెబ్రిటిలు మొక్కలు నాటుతున్నారు.బడా బడా పొలిటీషయన్లతోపాటు సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు కూడా ఇందులో పాల్గొని ఒకరికొకరు సవాళ్లు విసురుకుంటున్నారు.

తాజాగా ఈ చాలెంజ్ లో అక్కినేని నాగార్జున కూడా పాల్గొన్నారు.ఇటీవలే రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ నాగార్జున కు ఈ ఛాలెంజ్ విసిరాడు. తాజాగా దీని నాగ్ స్వీకరించాడు. “ఎంపీ ఛాలెంజ్ ను తాను స్వీకరించానని, తన స్టూడియోలో మొక్కలు నాటానని తెలిపాడు” నాగార్జున.

అనంతరం ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ కు, తనతో పాటు ఊపిరి సినిమాలో కో ఆర్టిస్ట్ గా నటించిన కార్తీకి, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కు, అలాగే కోడలు సమంతకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. మరి మామ సవాల్ ను కోడలు ఎప్పుడు స్వీకరిస్తుందో చూడాలి.