ప్రణయ్ మరణ వార్త విని నాగార్జున ఏం చేశాడో తెలిస్తే కన్నీరు రాకమానదు

391

కూతురు ప్రేమ వివాహం చేసుకుందని అల్లుడిని అతి కిరాతకంగా చంపించిన మిర్యాలగూడ ఘటన గురించి ఇప్పుడు దేశం మొత్తం మాట్లాడుకుంటుంది.తక్కువ కులానికి చెందిన వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకుందని అల్లుడంటే ఇష్టం లేని మారుతీరావు, కిరాయి గుండా చేత చంపించాడు..అమృత తండ్రి మారుతీరావుతో స‌హా ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు, సుభాష్ శ‌ర్మ కి కోటిరూపాయ‌ల సుపారితో ఈ డీల్ కుదుర్చుకున్నారు, అత‌న్ని బీహార్లో పోలీసుల అదుపులోకి తీసుకుని తెలంగాణ‌కు తీసుకువ‌చ్చారు..అయితే తన తండ్రిని ఉరి తీయాలని అమృత కోరుకుంటోంది, ఇప్ప‌టికే రాజకీయ నేతలు, కుల సంఘాలు, సామాజిక వేత్తలు ప్రణయ్ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. ఓదార్చుతున్నారు.

Image result for nagarjuna sad face

దీనిపై తాజాగా నాగార్జున కూడా స్పందించారు అని తెలుస్తోంది. నా బ‌డ్డ‌లాంటి అమృతకు వ‌చ్చిన క‌ష్టం చూస్తుంటే క‌న్నీరు వ‌స్తోంది.. జీవితంలో మ‌న‌కు ఎంతో ఇష్ట‌మైన వ్య‌క్తి మ‌న‌తో లేకుండా పోతే ఆ బాధ‌ ఎవ‌రూ తీర్చ‌లేనిది, దీనిని త‌ట్టుకోవ‌డం క‌ష్టం అని ఆయ‌న అన్నారు, ఆమెకు వ‌చ్చిన క‌ష్టం ఇంకెవ‌రికి రాకూడ‌దు అని కోరుకున్నారు, ఈ స‌మ‌యంలో ఆమెకు అండ‌గా మ‌నం ఉండాల‌ని ఆయ‌న అన్నారు, ఇలాంటిది సొసైటిలో మ‌రోక‌టి జ‌రుగ‌కుండా ఉండాలి అంటే అటువంటి వారికి క‌ఠిన శిక్ష వెయ్యాలని ఆయ‌న కోరుకున్నారు.. ఏ కులం అహంకారం అయితే ఇప్పుడు పెరిగిపోయిందో దానిని అణిచివేయాల‌ని ఈ విష‌యంలో ఆమె న్యాయ‌పోరాటానికి దిగడం మంచింది అని ఆమెకు అంద‌రూ అండ‌గా ఉండాల‌ని ఆయ‌న అన్నార‌ట‌.

Image result for pranay and amrutha
అమృత త‌ల్లి కూడా భ‌ర్త‌కు చెప్పి ఇలాంటివి చేయించ‌కుండా ఆపాల్సింది.. బిడ్డ‌లు సుఖంగా ఉంటేనే మ‌నం సుఖంగా ఉంటాము అనేది తెలుసుకోవాలి..వారి క‌న్న‌బిడ్డ‌ని చంపే హ‌క్కు మారుతిరావుకి ఎవ‌రు ఇచ్చారు, ఇలాంటి ప్రేమ‌ల‌ను వ్య‌తిరేకించే వారు ఇక‌నైనా మారాలి అని ఆయ‌న కోరారు. మిర్యాలగూడ ఘటన సామాన్య ప్రజలనే కాదు సెలెబ్రిటీలను కూడా కదిలిస్తుంది.ఇప్పటికే ఈ విషయం మీద సింగర్ చిన్మయి,మంచు మనోజ్,హీరో రామ్, రామ్ చ‌ర‌ణ్ లాంటి వాళ్ళు స్పందించారు.కులం అనే జబ్బు వలన నిండు ప్రాణం పోయింది.సమాజం ఇంత డెవలప్ అవుతున్న ఇంకా కులం ఏంట్రా అని హీరో రామ్ గట్టిగానే స్పందించాడు.అలాగే మంచు మనోజ్ మాట్లాడుతూ మన అందరికీ ఒకే రకమైన గుండె, శరీరం ఉన్నాయి.

ఒకే గాలిని పీలుస్తున్నాం, ఒకే ప్రపంచంలో జీవిస్తున్నాం. కానీ కులం పేరుతో, మతం పేరుతో వర్గాలుగా విడిపోవడం ఎందుకు? మనుషులంతా ఒకటే అనే విషయాన్ని ఈ ప్రపంచం ఎప్పుడు తెలుసుకుంటుంది?ఇలాంటి కుల పిచ్చి ఉన్న వారిని చూసి సిగ్గుపడుతున్నా అని తన ఆవేదనను తెలియజేశాడు. చూశారుగా సెల‌బ్రెటీల స్పంద‌న‌తో పాటు మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.