స్క్రీన్ మీద మరొకసారి అలరించిన నాగార్జున అఖిల్..

325

రియల్ లైఫ్ తండ్రి – కొడుకులను లేదా అన్నదమ్ములను స్క్రీన్ పై ఒకే సారి చూస్తే ప్రేక్షకులు ఖచ్చితంగా సర్ ప్రైజ్ – కొత్తగా ఫీల్ అవుతారు. అందుకే ఎక్కువ సినిమాలో గెస్ట్ రోల్ లో తండ్రి – కొడుకు – అన్న లేదా తమ్ముడు ఇలా ఆ సినిమా హీరోకు సంబంధించిన వారిని దర్శకులు చూపించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

Image result for akhil nagarjuna

ఆమద్య ‘మనం’ చిత్రంలో అక్కినేని ఫ్యామిలీ సభ్యులందరిని చూసి మురిసి పోయిన ఫ్యాన్స్ మళ్లీ మరోసారి ఆ కాంభినేషన్ ను కోరుకుంటున్నారు.కొడుకులతో కలిసి నటించేందుకు నాగార్జున ఆసక్తి చూపిస్తున్నాడు.అందుకే అఖిల్ సినిమాలో అఖిల్ తో కలిసి ఒక పాటలో ఆడిపాడిన నాగార్జున ఇప్పుడు మరొకసారి కొడుకుతో పాటు స్క్రీన్ మీద కనిపించాడు.

వీరిద్దరు కలిసి ప్రముఖ షాపింగ్ మాల్ అయిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కు బ్రాండ్ అంబాసిడర్స్ గా వ్యవహరిస్తున్నారు. ఆమద్య వీరిద్దరు కలిసి ఒక యాడ్ లో నటించారు. ఆ యాడ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కొత్త యాడ్ లో ఇద్దరు కూడా చాలా యాక్టివ్ గా కనిపించారు. ఆ యాడ్ ను అలాగే చూడాలనిపిస్తుంది. అక్కినేని ఫ్యాన్స్ సదరు యాడ్ కు ఫిదా అవుతున్నారు.