తాత మనువళ్లుగా నటించబోతున్న అక్కినేని నాగార్జున నాగచైతన్య

195

నాగార్జున, నాగచైతన్య కలిసి మరో సినిమాలో నటించబోతున్నారా అంటే అవుననే అంటుంది ఫిలిం ఇండస్ట్రీ. వీళ్ళిద్దరిని కలిపింది దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల. ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రానికి ఆయన సీక్వెల్‌ సిద్ధం చేస్తున్నారనే సంగతి తెలిసిందే. ‘సోగ్గాడే చిన్నినాయన’లో నాగార్జున తండ్రీ, కొడుకుగా ద్విపాత్రాభినయం చేశారు.

Image result for nagarjuna naga chaitanya

ఈ తాజా చిత్రంలో మూడో తరాన్ని కూడా చూపించబోతున్నారట. అందుకే మనవడి పాత్రకోసం నాగచైతన్యను సంప్రదించారట. తన పాత్ర వచ్చిన తీరు సంతృప్తికరంగా ఉండటంతో నాగచైతన్య వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారని టాక్‌. వేసవిలో సినిమాను సెట్స్‌ మీదకు తీసుకెళ్లనున్నారు.

Related image

నాగార్జున నాగచైతన్య కలిసి ‘మనం’లో సందడి చేసిన సంగతి తెలిసిందే.అప్పుడు తండ్రి కొడుకులుగా నటించారు.ఇప్పుడు తాతా, మనవడుగా నటించబోతున్నారు. చూడాలి మరి తాత మనువడిగా ఎలా అలరిస్తారో.