బాక్సాఫీస్ వద్ద ఒకేరోజు పోటీ పడుతున్న చైతూ, సమంత?

432

బహుశా టాలీవుడ్‌కు ఇదొక అరుదైన విషయం అవుతుందేమో. అటు భర్త హీరోగా నటించిన సినిమా, ఇటు భార్య ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఒకే రోజు విడుదలైతే అంతకన్నా విశేషం ఏముంటుంది? వచ్చే నెలలో ఇలాంటి పోటీనే నెలకొనే అవకాశం కనిపిస్తోంది.టాలీవుడ్ జంట నాగచైతన్య, సమంతలు తమ తమ సినిమాలతో ఒకే రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Image result for u turn cinema samantha

సెప్టెంబర్ 13న వీరి సినిమాలు విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.సమంతా నటించిన‘యూ టర్న్’ సినిమా విడుదల కాబోతోందనే ప్రకటన వచ్చింది. కన్నడలో సూపర్ హిట్ అయిన ‘యూటర్న్’ను తెలుగు, తమిళ భాషల్లో సమంత రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Image result for shailaja reddy alludu

ఇక నాగచైతన్య నటించిన ‘శైలజారెడ్డి అల్లుడు’ కూడా సెప్టెంబర్ 13న విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా ఈ విషయంలో అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ ఆ రోజున చైతూ సినిమా విడుదల ఉండవచ్చనే అంచనాలున్నాయి.అదే జరిగితే చైతూ, సమంతల సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నట్టే.ఇదే కనుక జరిగితే టాలీవుడ్ ప్రేక్షకులకు విశేషమే.