నాగచైతన్య బర్త్ డే సందర్భంగా రేపు అభిమానులకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్

292

రియ‌ల్ లైఫ్ క‌పుల్ నాగ‌చైత‌న్య, స‌మంత జోడీ రీల్ లైఫ్ కపుల్స్‌గా సందడి చేయబోతున్నారన్న సంగతి మన అందరికి తెలిసిందే.. నిన్నుకోరి ఫేమ్ శివ‌ నిర్వాన ద‌ర్శ‌క‌త్వంలో క‌లిసి న‌టిస్తున్నారు. దివ్యాంశ కౌశిక్ ఈ చిత్రంలో రెండో హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. త‌ణికెళ్ళ భ‌ర‌ణి, రావు ర‌మేష్, పోసాని కృష్ణ‌ముర‌ళి, సుబ్బ‌రాజు ఇత‌ర కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Image result for chai sam new film majili

ఈ రొమాంటిక్ డ్రామాకు గోపీసుంద‌ర్ సంగీతం అందిస్తుండ‌గా విష్ణు శ‌ర్మ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యాన‌ర్‌లో సాహు గ‌ర‌పాటి, హ‌రీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ ఇద్ద‌రూ కలిసి న‌టిస్తున్న నాలుగో సినిమా ఇది. ‘మజిలీ’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.అయితే రేపు (నవంబర్ 23) నాగ చైతన్య బర్త్ డే కావడంతో సర్ ప్రైజ్‌కి ప్లాన్ చేసింది చిత్రయూనిట్.

Image result for chai sam new film majili

చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చెయ్యబోతుందని సమాచారం.ఇదే నిజమైతే అక్కినేని అభిమానులకు పండుగే ఎందుకంటే ఈ రియల్ జోడి పెళ్ళాయ్యాకా చేస్తున్న మొదటిసినిమా కదా. వీళ్ళ లుక్ ఎలా ఉందొ తెలుసుకోవాలనే ఆత్రుత అక్కినేని అభిమానులలో ఉంది.40 శాతం షూటింగ్ పూర్తీ చేసుకుంది ఈ సినిమా.