నాగచైతన్య సరసన నిత్యమీనన్…దర్శకుడు ఎవరో తెలుసా..

191

అక్కినేని నాగచైతన్య మంచి జోష్ లో ఉన్నాడు.వరుసపెట్టి సినిమాలను ఒప్పుకుంటున్నాడు.ఈ ఏడాది ఇప్పటికే శైలజారెడ్డి అల్లుడు,సవ్యసాచి సినిమాలను మన ముందు తీసుకొచ్చాడు.ప్రస్తుతం నిన్ను కోరి ఫెమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో భార్య సమంతతో కలిసి మజిలీ చేస్తున్నాడు. సవ్యసాచి, శైలజారెడ్డి అల్లుడు లాంటి చిత్రాలు అభిమానులకు నిరాశ కలిగించాయి. దీనితో చైతు తదుపరి నటించే చిత్రాల విషయంలో జాగ్రత్త తీసుకుంటున్నాడు. తనకు అచ్చోచ్చిన ప్రేమకథలను నమ్ముకుంటున్నాడు.

Image result for naga chaitanya

నాగ చైతన్య తదుపరి చిత్రానికి కూడా గ్రీన్ సింగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంతో దర్శకుడుగా మేర్లపాక గాంధీ గుర్తింపు తెచ్చుకున్నాడు. మేర్లపాక గాంధీ వినిపించిన కథ నచ్చడంతో నాగ చైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Image result for naga chaitanya nitya menon

ఈ చిత్రంలో నాగ చైతన్యకు జోడిగా నిత్యా మీనన్‌ని ఎంపిక చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో ఈ చిత్రం రూపొందబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.