ఎన్టీఆర్ బయోపిక్ లో మెగా బ్రదర్ నాగబాబు..ఎవరి పాత్రో చూడండి.

311

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్’. ఎన్టీఆర్ పాత్రను ఆయన తనయుడు, నందమూరి బాలకృష్ణ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్.బి.కె.ఫిలింస్ ఎల్ఎల్‌పీ పతాకంపై బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత చిత్రం

ప్రేక్షకుల అంచనాలను దృష్టిలో పెట్టుకుని పాత్రల ఎంపికను చాలా జాగ్రత్తగా చేపడుతున్నారు.ఇప్పటికే చాలా మంది పెద్దవారు ఈ చిత్రంలో నటిస్తున్నారు.విద్యాబాలన్ కైకాల సత్యనారాయణ,రానా,సుమంత్,కీర్తి సురేష్ లాంటి హీరో హీరోయిన్స్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా ఈ ప్రాజెక్ట్‌లో మెగా బ్రదర్ నాగబాబు జాయిన్ అయ్యారట.

nagababu ntr biopic కోసం చిత్ర ఫలితం

ఎస్ వి రంగారావు పాత్రకు మెగా బ్రదర్ నాగబాబును ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంలోని పాత్రల గురించి జనం చాలా ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రంలో మెగా బ్రదర్ నాగబాబు చేరడంతో మరిన్ని అంచనాలకు చేరువైనట్టే. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది ‘ఎన్టీఆర్’.