‘ఇస్మార్ట్‌ శంకర్‌’ కోసం రెండవ బ్యూటీని ఒకే చేసి పూరీ

177

సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ కాంబినేషన్‌లో ఇస్మార్ట్ శంకర్ సినిమా వస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే. ‘డబుల్ ధిమాక్ హైదరాబాదీ’ అనే క్యాప్షన్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. రాజ్ తోట సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. పూరీ జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Image result for ismart shankar

ఈ సినిమా ఇటీవలే సెట్స్‌పైకి వెళ్లింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ చిత్రం బిజీగా షూటింగ్ జరుపుకొంటున్నది.ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా నిది అగర్వాల్ ను ఓకే అయ్యింది. అయితే ఈ సినిమాలో మరొక హీరోయిన్ కు ఛాన్స్ ఉంది. ఆ రెండవ హీరోయిన్ గా నభా నటేష్‌ ను తీసుకున్నారు.

Image result for nabha natesh

సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన నన్ను దోచుకుందువటే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయి నేచురల్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్న నభా ఈ సినిమాతో మరోసారి ఆకట్టుకుంటుందేమో చూడాలి.