నా కూతురు లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్లిపోయింది: రాజేంద్రప్రసాద్ మాటలు వింటే కన్నీళ్ళు ఆగవు

345

నటకీరిటి అనగానే మనకు గుర్తుకు వచ్చే పేరు రాజేంద్రప్రసాద్.కామెడీకి ఆయన కేరాఫ్ అడ్రెస్.ప్రస్తుతం ఎన్నో చిత్రాలలో తండ్రిగా మామగా చేస్తూ జనాలను అలరిస్తున్నాడు.”ఆన‌లుగురు”, “మీ శ్రేయాభిలాషి” లాంటి అద్భుతమైన చిత్రాలలో నటించాడు.ప్రస్తుతం ఆయన న‌టించిన చిత్రం ‘బేవ‌ర్స్‌’. సంజోష్‌, హ‌ర్షిత హీరో హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. కాసం స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్ క్రియెష‌న్స్ ప‌తాకం పై నిర్మాత‌లు పొన్నాల‌ చందు, ఎమ్ అర‌వింద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ర‌మేష్ చెప్పాల ద‌ర్శ‌క‌త్వం చేస్తున్నారు. సునీల్ కశ్య‌ప్ సంగీతం అందించిన ఈ మూవీ ఆడియో రిలీజ్ శనివారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా మిర్యాలగూడ ఘటన మీద స్పందిస్తూ తన కూతురు చేసిన పని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు.మరి ఆయనెమ్మాడో చూద్దామా.

Related image

ఈ మధ్య జరిగిన మిర్యాలగూడ ఘటన నన్ను ఎంతో కలచివేసింది.కూతురు తప్పు చేసిందని ఆ తండ్రి అంతకన్నా పెద్ద తప్పు చేశాడు.ఒక తల్లిలేని వాడు తల్లిని చూసుకోవాలంటే కూతురులో చూసుకుంటాడు.కూతురు అంటే తండ్రికి పంచప్రాణాలు.అలా అని తప్పు చేస్తే ఇలాంటి దారుణానికి పాల్పడాలా. నా పదవ ఏట మా అమ్మ చనిపోయింది. నాకు ఒకే ఒక కూతురు… పేరు గాయిత్రి. ఆమెతో నేను మాట్లాడను. ఎందుకంటే లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్లిపోయింది. ఇవన్నీ మామూలు విషయాలే.అలా అని నేనేమి నా కూతురిని చంపలేదు కదా.ఇప్పుడు నేను నటించిన చిత్రం బేవార్స్.ఈ టైటిల్ ఏంటి అని చాలా మంది అనుకుంటున్నారు. తల్లిదండ్రులను అర్థం చేసుకోని పిల్లలు మాత్రమే బేవర్స్ కాదు. పిల్లల్ని అర్థం చేసుకోని తల్లిదండ్రులు కూడా బేవర్స్ అవుతారు అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందించారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇక సినిమాలో ఒక ముఖ్యమైన పాట ఉంది. ‘తల్లీ తల్లీ నా చిట్టి తల్లీ… నా ప్రాణాలే పోయాయమ్మా’ అని సుద్దాల అశోక్ తేజ రాసిన పాట నా మనసుకు ఎంతగానో నచ్చింది. ఆ పాటను ఇంటికి తీసుకెళ్లి నా కూతురు గాయిత్రిని పిలిపించి ఎదురుగా కూర్చోబెట్టి నా మనస్పూర్తిగా ఆమెకు నాలుగు సార్లు వినిపించాను.. అమ్మ పోయినపుడు కూడా నేను ఏడవలేదు. కానీ కూతురు వెళ్లిపోయినపుడు ఏడ్చాను అని రాజేంద్ర ప్రసాద్ గుర్తు చేసుకున్నారు.మీరు నిజంగా మనసు ఉంటే ఈ పాటను జన్మలో మరిచిపోలేరు. సుద్దాల అశోక్ తేజ నాకంటే చిన్నవాడు లేదంటే ఆయన పాదాలకు నమస్కారాలు పెట్టేవాడిని. అంత అద్భుతంగా ఈ పాటను రాశాడని కొనియాడారు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.మిర్యాలగూడ ఘటన మీద రాజేంద్రప్రసాద్ అన్న మాటల గురించి అలాగే ఆయన నటిస్తున్న బేవార్స్ చిత్రం లోని తల్లి తల్లి పాట వింటే ఆ పాట గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.