మా బావా కౌశల్ ఇంట్లో దుమ్ము లేపుతున్నాడు…నేను కూడా కౌశల్ ఆర్మీనే

908

బిగ్ బాస్ సీజన్ 2 చాలా సక్సెస్ ఫుల్ గా నడుస్తుంది.రోజురోజుకు ఇంట్రెస్టింగ్ గా మారుతుంది.మొదట్లో బాగా లేదన్న వారు కూడా ఇప్పుడు చాలా ఆసక్తితో చూస్తున్నారు.అయితే ఇంట్లో అందరి కన్నా ఎక్కువ మార్కులు కొట్టేసింది మాత్రం కౌశల్ అనే చెప్పుకోవాలి.అతని క్యారెక్టర్ యాట్యుట్యూడ్ అన్ని జనాలకు నచ్చుతుంది.అతనికి బయట ఫాన్స్ అసోసియేషన్స్ కూడా ఏర్పడ్డాయి అంటేనే అర్థం చేసుకోండి.అయితే ఇతని గురించి కాజల్ ఇప్పుడు కొన్ని కామెంట్స్ చేసింది.ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for kajal aggarwal with koushal in mr perfect

రసవత్తరంగా సాగుతున్న బిగ్ బాస్ షోలో కౌశల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ లా తయారయ్యాడు. సోషల్ మీడియాలో విపరీతమైన అభిమానులను సంపాదించుకొని మిగతా కంటెస్టెంట్స్ కు గట్టి పోటీ ఇస్తున్నారు. కౌశల్ తో ఎవరు గొడవ పెట్టుకున్నా వాళ్ళను హౌస్ నుంచి ఎలిమినేట్ చేసే దిశగా అభిమానులు ఓట్లు వేస్తున్నారు. గత నాలుగు వారాలా నుంచి బిగ్ బాస్ లో ఇదే జరుగుతుంది.బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగినా.. ఆట మాత్రం బిగ్ బాస్ చేతుల్లోనే ఉంటుంది.

Image result for kaushal manda

కానీ ఈ సీజన్ లో మాత్రం ఆట మొత్తం కౌశల్ ఆర్మీ చేతుల్లోనే ఉంది. వాళ్ళు ఎవర్ని డిసైడ్ చేస్తే వాళ్ళే హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతున్నారు. నిజాయితీగా ఆడుతున్న కౌశల్ ను దోషిగా నిరూపించాలని చూస్తే ఆడియెన్స్ ఊరుకునే స్థితిలో లేరు.అతనికి చాలా మంది అభిమానులు ఉన్నారు.ఇప్పుడు ఆయన అభిమానుల లిస్టు లోకి చందమామ కాజల్ కూడా చేరారు.ఆమె అతనికి ఫుల్ సపోర్ట్ ఇస్తూ మాట్లాడుతుంది.ఆమె బిగ్ బాస్ గురించి మాట్లాడుతూ ..

మిస్టర్ ఫర్ఫెక్ట్ సినిమాలో నేను కౌశల్ తో వర్క్ చేశాను.అతను సినిమాలన్నా ఫ్యాషన్ రంగం అన్నా పిచ్చి.అతను క్యారెక్టర్ చాలా మంచిది.ఏ పని చేసిన కరెక్ట్ గా చేస్తాడు.ఎవరితో ఎలా మెలగాలో అతనికి తెలుసు.మొదట కౌశల్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాడని తెలిసి ఆశ్చర్యపోయాను.కానీ అతను ఇంట్లో ఉంటున్న విధానం చూసి అతనికి నేను ఫ్యాన్ ఐపోయాను అని చెప్పింది.బిగ్ బాస్ హౌస్ లో అందరు కలిసి తనను టార్గెట్ చేసినా కూడా అతను ఎక్కడ లెక్క చేయకుండా అతని ఆట అతను ఆడుతున్నాడు.వాటన్నిటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు.ఎవరిని ఇంప్రెస్ చెయ్యాలని నటించకుండా జెన్యూన్ గా గేమ్ ఆడుతున్నాడు.ఇక ముందు కూడా ఇలాంటి సమస్యలు ఎదురైతే కౌశల్ వాటిని దైర్యంగా ఎదుర్కోవాలని కోరుకుంటున్నా.కౌశల్ కు తన సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని కాజల్ అగర్వాల్ చెప్పారు.మరి కాజల్ అన్న మాటల గురించి అలాగే బిగ్ బాస్ హౌస్ లో కౌశల్ ప్రవర్తన మీద మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో చెప్పండి.