Breaking News:ప్రముఖ సినీనటుడు ఇకలేరు.. షాక్ లో మహేష్ బాబు

402

సినీ ఇండస్ట్రీలో వరుస విషాదఛాయలు అలుముకుంటున్నాయి. మొన్న నటి ఝాన్సీ ఆత్మహత్య చేసుకుంది ఆ తరువాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు విజ‌య బాపినీడు , అలాగే ప్రముఖ మహిళా సినీ ప్రొడ్యూసర్ నారా జయశ్రీ దేవి మృతి చెందారు. వీళ్ళ మరణాలు మరవకముందే మరొక సినీ నటుడు కన్నుమూశాడు. ప్రముఖ సినీ, రంగస్థల నటుడు డీఎస్‌ దీక్షితులు ఇవాళ కన్నుమూశారు. దీక్షితులు ఓ సీరియల్ చిత్రీకరణలో ఉండగా..ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను వెంటనే నాచారం ఆస్పత్రికి తరలించారు. దీక్షితులు అప్పటికే తుదిశ్వాస విడిచినట్లు డాక్లర్లు వెల్లడించారు. ఆయన పూర్తి పేరు దీవి శ్రీనివాస దీక్షితులు. ఈయన స్వస్థలం గుంటూరు జిల్లా రేపల్లె. హనుమంతాచార్యులు, సత్యవతమ్మ దంపతులకు గుంటూరు జిల్లా, రేపల్లెలో 1956, జులై 28 న దీక్షితులు జన్మించారు.murari fame ds deekshithulu passes away after heart attack in shooting

దీక్షితులు తెలుగు, సంస్కృత భాషల్లో రంగస్థల కళల్లో ఎంఏ డిగ్రీలు పొందారు. రేపల్లెలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేశారు. ఆ తర్వాత లెక్చరర్ ఉద్యోగాన్ని వదిలేసి హైదరాబాద్ కు వచ్చారు. ఏపీ థియేటర్ ఇనిస్టిట్యూట్ అండ్ రిపర్టీరీలో డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ లో చేరారు. దీక్షితులు డిప్లొమా చేస్తున్న సమయంలో పలు నాటకాలకు దర్శకత్వం వహించారు.శకుంతలం, హరిశ్చంద్ర, కీలు బొమ్మలు లాంటి నాటకాల్లో నటించడంతో పాటు గోగ్రహణం, కొక్కొరొక్కో, వెయింటింగ్ ఫర్ గోడాట్ లాంటి నాటకాలకు దర్శకత్వం వహించారు.ఆగమనం సీరియల్ కు గాను దీక్షితులు నంది అవార్డు అందుకున్నారు.

మహేశ్ బాబు హీరోగా నటించిన మురారి చిత్రంలో దీక్షితులు పోషించిన పూజారి పాత్ర తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. దీక్షితులు వీటితోపాటు ఇంద్ర, ఠాగూర్‌, అతడు, వర్షం సినిమాల్లో తనదైన నటనతో అందరిని మెప్పించారు.అక్కినేని యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్, రవీంద్ర భారతిలోని మీడియా యాక్టింగ్ సంస్థల్లో గురువుగా సేవలు అందించారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది ఆయన వద్ద నటనలో శిక్షణ తీసుకున్నారు. ఈయన మరణవార్త విన్న సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ అయ్యింది. అయన ఆత్మకు శాంతి చేకూరాలని నివాళి అర్పిస్తున్నారు. అక్కినేని కుటుంబం మా అసోసియేషన్ దగ్గరుండి మరి ఆయన కుటుంబాన్ని ఓదార్చుతున్నారు. ఆయన మృతికి మనం కూడా కామెంట్ రూపంలో నివాళి అర్పిద్దాం.