మెగా ప్రిన్స్ సరసన హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన డబ్ స్మాష్ బ్యూటీ

267

మెగా వారసుడిగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. మెగా ప్రిన్స్ గా పిలవబడుతున్న ఈ యంగ్ హీరో అన్ని
ప్రయోగ సినిమాలే చేస్తున్నాడు. ఇప్పటికే కంచె అంతరిక్షం వంటి ప్రయోగాలతో పాటు ముకుంద, ఫిదా,తొలిప్రేమ, ఎఫ్2 వంటి కమర్షియల్
సినిమాలు కూడా తీస్తూ తనకంటూ ఒక ఇమేజ్ ను ఏర్పాటుచేసుకున్నాడు.

Image result for varun tej harish shankar movie launch

అయితే ఇప్పుడు మరొక ప్రయోగం చెయ్యబోతున్నాడు.కోలీవుడ్
సూపర్‌ హిట్ జిగర్తాండకు రీమేక్‌ లో నటించబోతున్నాడు. ఈ చిత్రానికి వాల్మీకి అనే పేరు పెట్టారు. కమర్షియల్ సినిమాల స్పెషలిస్ట్‌ గా పేరుపొందిన
హరీష్ శంకర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ రీమేక్‌లో వరుణ్ నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపించనున్నాడట. ఒరిజినల్‌
వర్షన్‌లో సిద్ధార్థ్‌ చేసిన పాత్రలో వరుణ్ నటింస్తున్నాడు. 14 రీల్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నారు.

Image result for varun tej mrunalini ravi

‘వాల్మీకి’ షూటింగ్ జనవరి 27 ప్రారంభమైంది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా ఒక క్రేజీ బ్యూటీని తీసుకున్నారు. వరుణ్ తేజ్ కు జోడిగా
తమిళ డబ్‌స్మాష్ బ్యూటీ మృణాళిని రవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మృణాళిని తమిళ వీడియోలతో డబ్‌స్మాష్ చేస్తూ సోషల్ మీడియాలో
విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది.