మిస్ట‌ర్ మ‌జ్ను రివ్యూ అఖిల్ న‌ట‌న‌కు అంద‌రూ చ‌ప్ప‌ట్లు అక్కినేని కుటుంబం హ్యాపీ

345

అక్కినేని కుటుంబంలో మూడో త‌రం న‌టుడు అక్కినేని అఖిల్ వ‌రుస‌గా సినిమాలు చేసినా,. మంచి హిట్ అందుకోలేక‌పోయాడు.. ఇక తాజాగా మిస్ట‌ర్ మ‌జ్నుతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు…అక్కినేని అఖిల్, నిధి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘Mr మజ్ను’ మంచి అంచనాలతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి ‘తొలిప్రేమ’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన సెన్సిబుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించడంతో ఈ మూవీకి పాజిటివ్ బజ్ ఏర్పడింది. దీనికి తోడు టీజర్, ట్రైలర్‌లు ఫ్రెష్ లుక్‌తో ప్రేక్షకులకు చేరువ కావడంతో విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ నేడు ప్రపంచ వ్యాప్తంగా ‘Mr మజ్ను’ చిత్రాన్ని విడుదల చేశారు. ప్రముఖ సీనియర్ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని అఖిల్ కెరియర్‌లో అతి తక్కువ బడ్జెట్‌తో నిర్మించి మంచి ప్రీ రిలీజ్ బిజినెస్‌ను రాబట్టడం విశేషం. ఈ మూవీకి మంచి ఫామ్‌లో ఉన్న యువ సంగీత దర్శకుడు తమన్ అదిరిపోయే ట్యూన్స్ అందించారు.

Image result for mr.majnu posters

ఈ చిత్రం చూసిన అక్కినేని అభిమానులు సినీ ప్రేక్షకులు. ‘ఫస్టాఫ్ చాలా బాగుందని.. సెకండాఫ్‌లో ఎమోషన్స్ సీన్స్ వర్కౌట్ చేశారంటున్నారు. దర్శకుడు వెంకీ అట్లూరి తన మార్క్ సెన్సిబుల్ డైరెక్షన్‌ని మరోసారి వర్కౌట్ చేశారని.. అఖిల్‌తో ఎమోషన్స్ సీన్స్ బాగా చేయించారంటున్నారు. అయితే ఫస్టాఫ్‌తో పోలిస్తే.. సెకండాఫ్ కాస్త స్లో అయ్యిందంటున్నారు. అఖిల్ స్క్రీన్ ఎమోషన్స్, డాన్స్, ఫైట్స్‌తో ఆకట్టుకున్నాడని.. నటన పరంగా చాలా ఇంప్రూవ్ అయ్యారని ‘సిసింద్రీ అఖిల్ ఈజ్ బ్యాక్ అంటున్నారు. హీరోయిన్ నిధి అగర్వాల్ లుక్ బావున్నాయంటున్నారు.

తమన్ మరోసారి మంచి సాంగ్స్ ఇచ్చారని.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుందంటున్నారు. ముఖ్యంగా ‘హేయ్ నేనిలా’ సాంగ్ అదిరిపోయిందంటున్నారు. ఓవరాల్‌గా అఖిల్ ఖాతాలో హిట్ పడ్డట్టే అంటూ అక్కినేని ఫ్యాన్స్ వరుస ట్వీట్లు చేస్తుంటే.. కథ చాలా రొటీన్‌గానే ఉందని కొంద‌రు అంటున్నారు.. అయితే ప్రీ ఇంటర్వెల్ సీన్ సినిమాపై ఆసక్తి పెంచిందంటున్నారు. మొత్తానికి సినిమా టాక్ తో అంద‌రూ మంచి జోష్ లో ఉన్నారు, ఇక నాగ్ కూడా త‌న కుమారుడి చిత్రం హిట్ టాక్ రావ‌డంతో ఆనందంలో ఉన్నార‌ట‌.మరి మీరు కూడా సినిమాపై మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో తెలియచేయండి.