Breaking News:స్టార్ కమెడియన్ హఠాన్మరణం..శోకసంద్రంలో సినీ ఇండస్ట్రీ

586

సీని ఇండ‌స్ట్రీకి వ‌రుస షాక్ లు త‌గుతున్నాయి.. ఇప్ప‌టికే చాలా మంది ప్ర‌ముఖులు అకాల మ‌ర‌ణం, సినీ ఇండ‌స్ట్రీని క‌లిచివేస్తోంది.. సినీ విలాకాశంలో ఎంతో పేరు సంపాదించిన కొంద‌రు హీరోలు, ఆర్టిస్టులు, హీరోయిన్లు, అభిమానుల‌ను ఇటీవ‌ల వ‌దిలి వెళ్లిపోవ‌డంతో, అంద‌రూ శోక‌సంద్రంలో ఉన్నారు. ఇటు నంద‌మూరి హ‌రికృష్ణ‌మ‌ర‌ణం టాలీవుడ్ లో పెను విషాదం మిగిల్చింది అనే చెప్పాలి. టాలీవుడ్ ప్ర‌ముఖులు ఇలా ఒక్కొక్క‌రు వ‌దిలి వెళ్లిపోవ‌డం పై తీవ్ర మ‌నోవేధ‌న ఇటు వారి కుటుంబాల్లో, అభిమానుల్లో పెరిగిపోయింది..

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఈ స‌మ‌యంలో ప్రముఖ త‌మిళ హాస్య‌న‌టుడు మ‌ర‌ణం, విషాదాన్ని నింపేసింది.ప్రముఖ హాస్య నటుడి మృతితో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. కోవై సెంథిల్‌ అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. పడ యప్ప, పుదుమై పిత్తన్‌ గోవా ఏయ్‌’ తదితర చిత్రాల్లో చిన్న చిన్న క్యారెక్టర్‌ రోల్స్‌లో మెప్పించిన సెంథిల్‌… తనదైన శైలిలో హాస్యం పండించి తమిళ ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. ఆయన అసలు పేరు కుమారస్వామి. కోవై సమీపంలోని వడవల్లి ఆయన స్వస్థలం. కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. స్వస్థలంలోనే ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన మృతికి నడిగర్‌ సంఘం సంతాపం వ్యక్తం చేసింది. ప్ర‌ముఖ హాస్య‌న‌టులు త‌మిళ‌నాట హీరోలు ఆయ‌న మృతిపై విచారం వ్య‌క్తం చేశారు.

సెంథెల్ చాలా స‌ర‌దాగా ఉండే వ్య‌క్తి అని అంటున్నారు సినీ ఇండ‌స్ట్రీలో వ్య‌క్తులు.. అలాగే ఆయ‌నకు ఎవ‌రితోనూ వివాదాలు లేవు అని చెబుతున్నారు… చాలా వ‌ర‌కూ సినీ ఇండ‌స్ట్రీలో అంద‌రితో చాలా క‌లివిడిగా ఉన్నారు అని, ఆయన ఇప్ప‌టి వ‌ర‌కూ న‌టించిన అన్ని సినిమాలు బాగా హిట్ అయ్యాయ‌ని అందుకే ఆయ‌న మంచి కమెడియ‌న్ బిరుదును తెచ్చుకున్నార‌ని సెట్లో అంద‌రిని ఆయ‌నే వెళ్లి ప‌ల‌క‌రిస్తారు అని అన్నారు. అలాగే సెంధెల్ మంచి వాక్చాతుర్యం క‌లిగిన వ్య‌క్తి అని ఆయ‌న ఈరోజు ఇలా అంద‌ర్ని వ‌దిలి వెళ్లిపోవ‌డంతో ప‌రిశ్ర‌మ‌లో వారు క‌న్నీటి ప‌ర్యంత‌మ‌వుతున్నారు.