Breaking News: సినీ నటి ఆత‍్మహత్య షాక్ లో ఇండస్ట్రీ

420

మనిషి రోజురోజుకు పిరికివాడిలా తయారవుతున్నాడు.ఏ చిన్న కష్టం వచ్చిన పోరాడకుండా ఆత్మహత్య అనే పిరికి చేష్టను ఎంచుకుంటున్నారు.ప్రేమలో విఫలం అయినా పరీక్షలో తప్పిన అమ్మానాన్న తిట్టిన భర్త ఏమైనా అన్నా ఇష్టం లేని పెళ్లి చేస్తున్న ఇలా ప్రతి విషయానికి ఆత్మహత్య చేసుకుంటున్నాడు.ప్రతిరోజు కొన్ని వందల సంఖ్యలో ఆత్మహత్య చేసుకుంటున్నారు.అయితే ఈ ఆత్మహత్యలలో సినిమా రంగానికి చెందినా వారు కూడా ఉండడం బాధాకరం.ఈ మద్య వరుసగా సినీ రంగానికి చెందినా వాళ్ళు చనిపోతున్నారు.కొంతమంది ఆత్మహత్య చేసుకుంటుంటే మరికొందరు అనారోగ్య కారణాల వలన లేదా యాక్సిడెంట్స్ అయ్యి చనిపోతున్నారు.ఇప్పుడు మరొక నటి చనిపోయింది.మరి ఆమె ఎవరు ఎలా చనిపోయిందో ఇప్పుడు తెలుసుకుందాం.

సినీనటి ప్రియాంక ఆత్మహత్య చేసుకుంది. చెన్నై వలసరవక్కాం లోని ఆమె ఇంటిలో పనిమనిషి వచ్చే సరికి ప్రియాంక విగతజీవిగా కనిపించారు. దీంతో ఆమె కుటుంబసభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. పలు విజయవంతమైన టీవీ సీరియల్స్‌, సినిమాల్లో నటించిన ప్రియాంక ఆత్మహత్య చేసుకోవడం తమిళ సినీ పరిశ్రమను షాక్ కు గురిచేసింది. తమిళ్‌లో ‘వంశం’ లాంటి సక్సెస్‌ఫుల్‌ సీరియల్స్‌తో పాపులర్ అయ్యింది.ఈ సీరియల్ లో ప్రముఖ నటి రమ్యకృష్ణ ప్రధానపాత్రలో నటించింది.ఆ తరువాత సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది ప్రియాంక.తమిళులంలో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. కాగా ప్రియాంక మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. కాగా రెండేళ్ల కిందటే వివాహం చేసుకున్న ఆమె గత మూడు నెలలుగా భర్తకు దూరంగా ఉంటున్నట్టు పనిమనిషి పోలీసులకు వెల్లడించినట్టు తెలుస్తోంది.భర్తతో విభేదాలు తల్లిదండ్రులు దూరంగా ఉండడం వలన మెంటల్ గా బాగా డిస్టర్బ్ అయ్యి ఉంటుందని అనుకుంటున్నారు.కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నారు.

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ప్రియాంక మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించిన పోలీసులు కేసుని దర్యాప్తు చేస్తున్నారు.అయితే ఈమె మృతి పట్ల తమిళ ఇండస్ట్రీ నటులు అలాగే సీరియల్స్ నటులు తమ సంతాపాన్ని ప్రకటించింది.నడిగర్ సంఘం ఆమె మృతికి నివాళులు అర్పించింది.మరి మనం కూడా ఆమె మృతికి కామెంట్ రూపంలో నివాళులు అర్పిద్దాం.ఇక్కడ అందరు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది.కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి.కాబట్టి వాటికి భయపడి అత్మహత్య లాంటి పనులు మాత్రం ఎవ్వరు చెయ్యకండి.మరీ ఈ నటి ఆత్మహత్య వెనుక ఉన్న విషయాల గురించి అలాగే ఇలా ఆత్మహత్య చేసుకునే వారి గురించి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో చెప్పండి.