మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి డైరెక్టర్‌ ఫిక్స్‌…స్టార్ డైరెక్టర్ చేతిలో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ..

323

నందమూరి మరొక వారసుడి సినీ ఎంట్రీకి రంగం సిద్దమయ్యింది.బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. గత రెండేళ్లుగా మోక్షజ్ఞ ఎంట్రీ పై రకరకాల వార్తలు వినిస్తున్నాయి. బోయపాటి శ్రీను, క్రిష్‌ లాంటి దర్శకులతో సినిమాలు కన్ఫామ్‌ అయినట్టుగా కూడా వార్తలు వినిపించాయి.అయితే అవన్నీ ఉట్టి పుకార్లే అని తేలిపోయింది.

Nandamuri Mokshgna Debut In Puri Jagannadh Direction - Sakshi

అయితే ఇప్పుడు మరొక దర్శకుడి పేరు వినిపిస్తుంది.డాషింగ్ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వనున్నాడన్న టాక్‌ వినిపిస్తోంది.మాస్, యూత్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకునే చిత్రాలు తెరకెక్కించటంలో పూరి స్పెషలిస్ట్‌. ఇటీవల పూరి దర్శకత్వంలో పైసా వసూల్‌ సినిమా చేసిన బాలయ్య, పూరి డైరెక్షన్‌లో మోక్షజ్ఞను పరిచయం చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట. అయితే ప్రస్తుతం పూరి ట్రాక్‌ రికార్డ్ అంత బాగోలేదు. అయినా బాలయ్య తన తనయుడిని పూరి చేతుల్లో పెడతాడేమో చూడాలి.

Image result for mokshagna debut movie puri jagannath

ఎందుకంటే మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌తో పాటు సాండల్‌వుడ్‌ స్టార్‌ హీరో పునీత్‌ రాజ్‌ కుమార్‌, యంగ్ హీరో ఇషాన్‌లను వెండితెరకు పరిచయం చేశాడు పూరి.వాళ్ళు ఇప్పుడు సక్సెస్ ఫుల్ హీరోలుగా వెలుగొందుతున్నారు.వాళ్లలాగే తన కొడుకు కూడా స్టార్ అవుతాడని అందుకే పూరి వైపు బాలయ్య చూస్తున్నాడని ఫిలిం నగర్ కోడై కూస్తుంది.చూడాలి మరి ఏం జరుగుతుందో.