మోహన్‌లాల్ మూవీతో దగ్గబాటి అభిరామ్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ

285

కేరళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన మలయాళం మూవీ ‘ఒడియన్’ తెలుగులో కూడా విడుదల కాబోతోంది.విఏ శ్రీకుమార్ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ చిత్రంలో మోహన్ లాల్ రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నాడు. మనుషులను జంతువుల రూపంలో దాచి పెట్టే ఒడి విద్య అనే మ్యాజిక్ ట్రిక్ ఇందులో చూపిస్తారని తెలుస్తోంది.

Image result for ఒడియన్

మోహన్ లాల్ స్టైల్ మాస్ యాక్షన్‌తో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో సిద్ధిఖి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం హక్కులను ‘దగ్గుబాటి క్రియేషన్స్’ దక్కించుకుంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

Image result for abhi ram suresh babu

ఈ సినిమా కోసం చాలా మంది బడా నిర్మాతలు పోటీ పడ్డప్పటికీ దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన దగ్గుబాటి అభిరామ్, సంపత్ ఈ చిత్ర హక్కులను సొంతం చేసుకున్నారట. సురేష్ ప్రొడక్షన్ వారి అనుబంధ సంస్థే ఈ దగ్గుబాటి క్రియేషన్స్ అని చెప్పుకుంటున్నారు.డిసెంబర్ 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.