సైరా పై కలెక్షన్ కింగ్ సంచ‌ల‌న‌ ట్వీట్. వైర‌ల్ చేస్తున్న మెగా అభిమానులు

523

మెగా వ‌ర్సెస్ మంచు అనే టైటిల్ ఎప్పుడు చూసినా ఏం జ‌రిగిందా అని అనుకుంటాం, అయితే మెగాస్టార్ చిరంజీవి మంచు మోహ‌న్ బాబు సినిమాలల్లో ఇద్ద‌రూ మంచి ఇమేజ్ సంపాదించుకున్నారు. ఇటు మోహ‌న్ బాబు నిర్మాత‌గా విల‌క్ష‌ణ న‌టుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఇక చిరంజీవి టాలీవుడ్ కు మెగా స్టార్ అయ్యారు, ఇద్ద‌రికి దాస‌రి గురువులా వ్య‌వ‌హ‌రించారు. అయితే చిరంజీవి కంటే దాసరి మంచు మోహ‌న్ బాబుతోనే ఎక్కువ‌గా చ‌నువుగా ఉండేవారు. చిరంజీవి సినిమాలు విడుద‌ల అయిన స‌మ‌యంలో మంచు మోహ‌న్ బాబు ఎప్పుడూ పెద్ద‌గా మీడియా ముఖంగా ఆ సినిమాల గురించి చెప్పింది లేదు. అయితే ఇటు చిరంజీవి కూడా మోహ‌న్ బాబు సినిమాల గురించి ప్ర‌శంసించింది లేదు కాని తాజాగా మోహ‌న్ బాబు సైరా సినిమాపై అద్బుత‌మైన ట్వీట్ పెట్టి మెగాస్టార్ చిరంజీవిని ప్ర‌శంసించారు.

Image result for mohan babu

తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన “సైరా నరసింహా రెడ్డి” ఇప్పుడు విడుద అయింది టాలీవుడ్ లోనే కాదు యావ‌త్ భార‌త‌దేశ వ్యాప్తంగా వ‌సూళ్లు ప‌రంప‌ర కొన‌సాగిస్తోంది తొలిరోజు ట్రేడ్ మార్క్ దాటే అవ‌కాశం ఉంది అంటున్నారు అభిమానులు…భారీ యాక్షన్ మరియు ఎపిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు చిత్ర యూని్ట్ అలాగే చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది.ఈ చిత్రం కోసం ఇప్పుడు ఒక్క మెగాభిమానులు మాత్రమే కాకుండా యావత్తు భారతదేశ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు.

ఈ క్రింద వీడియో చూడండి

తాజాగా టాలీవుడ్ విలక్షణ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సైరా చిత్రంపై ఆసక్తికర ట్వీట్ చేసారు.”నా మిత్రుడు చిరంజీవి మంచి నటుడు, తన కుమారుడు చరణ్ అధిక వ్యయంతో తీసిన సినిమా సైరా. ఇది అత్యద్భుతమైన విజయాన్ని సాధించాలని నిర్మాత చరణ్ కు, చిరంజీవి కి డబ్బుతో పాటు పేరు ప్రఖ్యాతలు తేవాలని మనసా వాచా కోరుకుంటున్నాను.బెస్ట్ ఆఫ్ లక్” అని ట్వీట్ చేసి చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆయ‌న చేసిన ట్వీట్ పై ఇటు మెగా అభిమానులు షేర్ చేస్తున్నారు, మెగాస్టార్ చిరంజీవి అంద‌రివాడు అన‌డానికి ఈ ట్వీట్ నిద‌ర్శ‌నం అని అంటున్నారు, మెగాస్టార్ చిరంజీవి మోహ‌న్ బాబు సినిమాల్లో ఎంతో పోటి ప‌డ్డా బ‌య‌ట మాత్రం మంచి స్నేహితులుగా ఉంటారు, సో ఇటు మంచు అభిమానులు మెగా అభిమానులు ఈ ట్వీట్లను పెద్ద ఎత్తున షేర్ చేసుకుంటున్నారు సోష‌ల్ మీడియాలో, ఇలా ప‌ర‌స్ప‌రం హీరోలు అభినందించుకోవ‌డం మంచి సంప్ర‌దాయం అనే చెప్పాలి, మ‌రి మీరేమంటారు మీ అభిప్రాయం కామెంట్స్ లో తెలియ‌చేయండి.