హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న ఎంఎం కీరవాణి కుమారుడు

259

సినిమా ఇండస్ట్రీలోకి మరొక వారసుడు రాబోతున్నాడు.ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కొడుకు హీరోగా రాబోతున్నాడు.కీరవాణి కుటుంబం నుంచి ఇప్పటి వరకు వారసులు వచ్చినా వారు కూడా సంగీత ప్రపంచంలోనే తమ టాలెంటును నిరూపించుకునే ప్రయత్నం చేశారు.

Image result for mm keeravani family

ఇప్పటికే కీరవాణి తనయుడు కాలబైరవ సింగర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే కీరవాణి చిన్న కుమారుడు సింహా కోడూరి సంగీతం వైపు కాకుండా నటన వైపు వస్తున్నాడు.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మైత్రి మూవీ మేకర్స్ వారు సింహతో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Mythri Movie Makers film with Keeravanis son Simha Koduri

ఒక కొత్త దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు.ఒక అసాధారణ థీమ్‌తో ఈ మూవీ ఉండబోతోందని తెలుస్తుంది.మైత్రీ మూవీస్ సినిమా చేస్తుంది అంటే కథ మంచిగానే ఉంటుందని అందరు అనుకుంటున్నారు.