మిస్టర్ మజ్ను విడుదల తేదీని ప్రకటించిన అక్కినేని అఖిల్

314

యువ కథానాయకుడు అక్కినేని అఖిల్‌ మూడో సినిమాకు ‘మిస్టర్‌ మజ్ను’ అనే టైటిల్‌ ఖరారైంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో నిధి అగర్వాల్‌ కథానాయికగా బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాతగా తమన్‌ బాణీలు అందిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన లవర్‌ బాయ్‌లా కనిపించారు.గత చిత్రాలతో పోల్చితే ఇందులో అఖిల్‌ లుక్‌, పాత్ర చాలా విభిన్నంగా ఉన్నాయి. ఈ చిత్రంలో అఖిల్‌ ప్లేబాయ్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది.

Image result for mister majnu

ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ను ట్విటర్ ద్వారా అఖిల్ షేర్ చేశాడు.మొదట ఈ చిత్రాన్ని జనవరిలో విడుదల చేయాలని భావించారు. జనవరిలో భారీ చిత్రాల విడుదల ఉండడంతో మిస్టర్ మజ్ను చిత్రం వాయిదా పడొచ్చనే ఊహాగానాలు వినిపించాయి. తాజాగా అఖిల్ మిస్టర్ మజ్ను విడుదల విషయంలో క్లారిటీ ఇచ్చాడు.

Akhil Gives clarity on MrMajnu release

‘‘మిస్టర్ మజ్ను’ గురించి అప్‌డేట్. ఈ చిత్రం ప్యాచ్ వర్క్ శరవేగంగా సాగుతోంది. డిసెంబర్ 3 నాటికి సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుంది. ఒక సాంగ్ షూట్ చేయాల్సి ఉంది. జనవరిలో ఈ సినిమాను రిలీజ్ చేస్తాం’’ అని అఖిల్ ట్వీట్‌లో పేర్కొన్నాడు.