తన పెళ్లి గురించి స్పందించిన మిల్కీ బ్యూటీ…ఏమని చెప్పిందో తెలుసా..!

494

మిల్కీ బ్యూటీ తమన్నా సినిమాలతోనే కాకుండా స్టోర్ ఓపెనింగ్స్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎప్పుడూ బిజీ గా ఉంటుంది..ఈ మధ్య హ్యాపి మొబైల్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయింది..ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పింది..పవన్ కళ్యాణ్ ను కెమెరామాన్ గంగతో సినిమా తరువాత ఎప్పుడైనా కలిసారా అని అడగ్గా ఎయిర్ పోర్ట్ లో రెండు మూడు సార్లు కలిసానని ఆయన చాల హంబుల్ పర్సన్ అని, ఇంత క్రేజ్ ఉన్నా సరే సింపుల్ గా ఉంటారని, అదే నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పుకొచ్చింది…

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టారు కదా సపోర్ట్ చేస్తారా అని అడిగితే “నాకు పాలిటిక్స్ గురించి అసలేమీ తెలియదు. కొంచెం తెలిసినా సపోర్ట్ చేసేదాన్ని.. పవన్ కళ్యాణ్ గారు ఏ పని చేసినా నా వైపు నుండి బెస్ట్ విషెస్ ఎప్పుడూ ఉంటాయి.” తమన్నాను మీ పెళ్లి ఎప్పుడు అని అడిగితే మాత్రం కస్సుబుస్సులాడింది. “నా పెళ్లి గురించి మీకెందుకండీ. మీకు పెళ్లయిందా? మీరు హ్యాపీగా ఉన్నారా? నా పెళ్లి గురించి ఇంటర్నెట్లో చాలా వార్తలు చూస్తున్నాను. నాకు అతడితో ఇతడితో పెళ్లి అవుతుంది అని రాస్తున్నారు. నాకది ఆశ్చర్యంగా ఉంది. ఇతర హీరోయిన్లకు మంచి హస్బెండ్ దొరికాడు కాబట్టి త్వరగా పెళ్లయింది. అందరికీ అలా దొరకాలి కదా… మీ అందరి ఆశీస్సులతో నాకు మంచి హస్పెండ్ దొరుకుతాడని ఆశిస్తున్నాను. ప్రస్తుతానికి నేను ఇపుడు నా పనులతో చాలా బిజీగా ఉన్నాను” అని చెప్పింది..’సైరా’ సినిమా లో తన పాత్ర గురించి ఆడిగితే “సైరా లో నాదొక కీలక పాత్ర. సైరా’లో చిరంజీవి గారితో పని చేయడం సంతోషంగా ఉంది. ‘బాహుబలి’లో నేను చేసిన పాత్రకు ఎంత మంచి పేరొచ్చిందో సైరాలో చేసే పాత్రకు కూడా మంచి గుర్తింపు వస్తుందనే నమ్మకం ఉంది” అంటూ ముగించింది.