మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ నెక్ట్స్ మూవీ ఖరారు

256

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు చిరంజీవి చిన్న కూతురు శ్రీజను పెళ్లాడిన కళ్యాణ్ దేవ్ ఇదివరకే హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే. ఆ మధ్య ‘విజేత’ అనే సినిమా ద్వారా నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు.. తొలి సినిమాతోనే కళ్యాణ్ దేవ్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

Related image

మంచి కథతోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ‘విజేత’ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ కమర్షియల్‌గా వర్కౌట్ కాలేదు. ‘విజేత’ సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న కళ్యాణ్ దేవ్ త్వరలో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అతడు నటించబోయే సెకండ్ మూవీ ఖరారైంది.

కళ్యాణ్ దేవ్ మూవీ

రిజ్వాన్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థపై ఈ చిత్రం తెరకెక్కబోతోంది.ఈ సంస్థ ఇంతకముందు నాటకం అనే చిత్రాన్ని తీశారు.చిత్రానికి పులి వాసు దర్శకత్వం వహించబోతున్నారు.పూర్తీ వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.