గీతా గోవిందం హిట్ అవ్వడం కోసం తనవంతు సాయం చేస్తున్న మెగాస్టార్..

337

యూత్ ఐకాన్ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం గీత గోవిందం.విజయ్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటించింది.గీత ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. బన్నీ వాసు ఈ చిత్రానికి నిర్మాత. శ్రీరస్తు శుభమస్తు ఫేమ్ పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు.

ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య కెమిస్ట్రీ ఈ చిత్రంపై అంచనాలు పెంచే విధంగా ఉంది.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఆడియో వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్యఅతిధిగా హాజరైన సంగతి తెలిసిందే.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ ని వైజాగ్ లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 12 న వైజాగ్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ జరుగుతుందట. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే ఈ వేడుకకు మెగాస్టార్ చిరు ముఖ్య అతిధిగా హాజరు కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావలసి ఉంది.