నాకు ఖైదీ..విజయ్ కు గీత గోవిందం..చిరంజీవి

337

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా పరశురాం దర్శకత్వంలో రూపొందిన గీత గోవిందం ఈ నెల 15 న విడుదలయి మంచి కలక్షన్లతో బ్లాక్ బస్టర్ హిట్ దిశగా దూసుకుపోతోంది..అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ గీతా ఆర్ట్స్ 2 పతాకంపై ఈ సినిమా ను నిర్మించగా గోపి సుందర్ సంగీతం అందించారు..ఈసంధర్బంగా చిత్ర యూనిట్ విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ నాకు ఈ రోజు సైరా షూటింగ్ వున్నా దాన్ని కాదనుకొని విజయ్ కోసం ఈ ఫంక్షన్ కు వచ్చాను.

ఈచిత్రం ఇంత పెద్ద విజయం సాధించినందుకు చాలా ఆనందంగా వుంది. ఈ లాంటి సినిమాను మా గీత ఆర్ట్స్ సంస్థ కు అందించిన డైరెక్టర్ పరుశురాం గారికి ధన్యవాదాలు. అలాగే సినిమా కథను నమ్మి ఇంత అద్భుతంగా నిర్మించారు బన్నీ వాసు ఆయన నిర్మాత మరింత గొప్ప స్థాయికి చేరుకుంటారు. ఇక ఈచిత్ర హీరో విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో అన్ని వర్గాలకు చేరువకాలేకపోయిన ఈసినిమాతో అన్నివర్గాల ప్రేక్షకులను అలరించాడు. ఖైదీ సినిమా నన్ను స్టార్ హీరోను చేస్తే ఈ గీత గోవిందం విజయ్ ను స్టార్ హీరోగా మార్చింది. అలాగే చిత్రంలో నటించిన రష్మిక, కిశోర్ , రాహుల్ రామకృష్ణ, అన్నపూర్ణ అద్భుతంగా నటించారని అన్నారు.