సినిమా ఇండస్ట్రీకి అల్లు అరవింద్ గుడ్ బై..?

368

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పనున్నారట…ఈ విషయాన్ని అరవింద్ స్వయంగా దిల్ రాజు గారితో చెప్పారట..దాదాపు నాలుగు దశాబ్దాలుగా నిర్మాతగా ఎన్నో విజయాలను చవి చూసిన అల్లు అరవింద్ తాజాగా గీత గోవిందం సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించారు..ఈ సినిమా విడుదలకు మూడు రోజుల ముందు కీలక సన్నివేశాలు లీక్ అవడంతో ఆయన మనస్థాపానికి గురయ్యారని సమాచారం..ఈ షాక్ తో ఇక సినిమా ఇండస్ట్రీ ని వదిలిపెట్టి పోవాలని ఉందని అరవింద్ అన్నట్లు దిల్ రాజు తెలిపాడు.

రెండు రోజుల కిందట తనకు అల్లు అరవింద్ ఫోన్ చేసి ఇండస్ట్రీని వదిలిపోవాలన్నంత బాధ కలుగుతోందని అన్నట్లు రాజు చెప్పాడు. నాలుగు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఆయన అలాంటి మాట అనడం తనకెంతో ఆవేదన కలిగించిందని రాజు చెప్పాడు. ఐతే తామంతా మీ వెనుక ఉన్నామని చెప్పి అరవింద్ కు ధైర్యం చెప్పానన్నాడు. తామందరికీ సినిమా అంటే ప్రాణం అని.. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి సినిమాలు తీసే నిర్మాతలకు అన్యాయం చేయొద్దని రాజు కోరాడు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే అని.. ఆ తప్పు చేసిన వాళ్లే పైరసీని ఆపాలని.. ఇది విజ్నప్తి అనుకున్నా.. హెచ్చరిక అనుకున్నా పర్వాలేదని రాజు చెప్పుకొచ్చాడు.