మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రామ్ చరణ్..!

383

రంగస్థలం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మెగా పవర్ స్టార్  రామ్ చరణ్ తన తరువాతి సినిమా బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నాడు..యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే దర్శకుడు బోయపాటి శ్రీను..మరి చరణ్ 12 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను బోయపాటి ఎలా మలుస్తాడో..రంగస్థలం సినిమాలో చిట్టిబాబు పాత్రలో అద్వితీయమైన నటనతో మెప్పించిన చరణ్ ఈ సినిమాలో ఏ పాత్ర పోషిస్తున్నాడనేది ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం లో చరణ్ ఏ రోల్ చేస్తున్నాడనేది బయటకు వచ్చింది.

ఈ చిత్రంలో చరణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడని సమాచారం. ఆయన ఇంతకుముందు ‘తుఫాన్, ధృవ’ చిత్రాలలో పోలీస్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి అదే గెటప్ లో కనిపించబోతున్నాడు. మరో చరణ్ బోయపాటి ఏ రేంజ్ లో చూపించబోతున్నాడో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈచిత్రంలో కైరా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. డి వి వి ఎంటర్ టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య డి వి వి నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకులముందుకు రానుంది.