మెగా డాట‌ర్ వెడ్డింగ్ డేట్ ఫిక్స్

623

నిజ‌మే నిహారిక పెళ్లి ఎప్పుడు అని అనుకుంటున్నారా… ఆమె పెళ్లి అయితే అంద‌రికి తెలుస్తుంది క‌దా అని అనుకుంటున్నారు క‌దా.. అవును మెగా డాట‌ర్ నిహారిక కొణిదెల సుమంత్ అశ్విన్ హ్యాపీ వెడ్డింగ్‌కు ముహూర్తం ఫిక్స్ అయింది… యూవీ క్రియేషన్స్, పాకెట్ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న హ్యాపీ వెడ్డింగ్ చిత్రానికి లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.

ఈ సినిమా మొత్తం పెళ్లి కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. పెళ్లికి ముందు అమ్మాయి, అబ్బాయికి ఉండే కన్ఫ్యూజన్స్, ఫ్యామిలీ వంటి అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా విడుదల తేదీని తాజాగా యూవీ క్రియేషన్స్, పాకెట్ సినిమా ఫిక్స్ చేశాయి. ఈ నెల 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది అనేద తెలియ‌చేసింది.

ఇక మెగా డాట‌ర్ సినిమాపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు ఇటు అభిమానులు.. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు.. ఇక ఇటు నిహారిక కూడా ఈ సినిమా సూప‌ర్స్ స‌క్సెస్ అవుతుంది అని, ఈ సినిమా స‌రికొత్త చిత్ర‌మ‌ని చెబుతోంది మెగా డాట‌ర్.. మ‌రి చూడాలి ఈ వెడ్డింగ్ ఎలా ఉండ‌బోతోందో.