Breaking News : ప్రముఖ టాప్ సింగర్ దుర్మరణం… షాక్ లో ఇండస్ట్రీ

354

సినీ పరిశ్రమలో ఈ మధ్య విషాద ఛాయలు అలుముకుంటున్నాయి.చాలా మంది ప్రముఖులు చనిపోయారు.రోడ్డు ప్రమాదాలు జరిగి కొందరు చనిపోతుంటే ఆరోగ్యం బాగాలేక కొందరు చనిపోతున్నారు.. వీళ్ళ మరణం వలన కుటుంబ సభ్యులే కాదు అభిమానులు కూడా దుంఖ సాగరంలో మునిగిపోతున్నారు. ఇప్పుడు ఒక ప్రముఖ పాప్ సింగర్ మరణించారు.

shivani bhatia

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ప్రముఖ పాప్ సింగర్ శివానీ భాటియా దుర్మరణం పాలయ్యారు. మధుర జన్‌పథ్ వద్ద యమున ఎక్స్‌ప్రెస్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఢిల్లీకి చెందిన ఈ సింగర్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో ఆమె భర్త నిఖిల్ భాటియా తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతున్నారు.తన భర్తతో కలిసి ఆగ్రాలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందకు శివానీ భాటియా దంపతులు కారులో బయలురేరారు. వారి కారు సురీర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 89వ మైలురాయి వద్ద చేరుకోగానే, వెనుక నుంచి వచ్చిన గుర్తుతెలియని వాహనమెకటి ఢీకొంది.డీ కొట్టగానే కారు పల్టీలు కొట్టి చాలా దూరంలో ఎగిరిపడింది. సీట్ బెల్ట్ పెట్టుకొని కారణంగా శివాని అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు వెంటనే స్పందించి అంబులెన్స్ కు ఫోన్ చేసిన లాభం లేకుండా పోయింది. ఆగ్రాలో జరిగే ఒక కార్యక్రమానికి హాజరవుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బీహార్‌కు చెందిన శివానీ దంపతులు ఢిల్లీలోని లాజ్‌పత్‌నగర్‌లో నివాసముంటున్నారు. స్థానికంగా పాప్ గాయనిగా ఆమె ఎంతో పేరు సంపాదించారు.ఈమె బాలీవుడ్ లో టాలీవుడ్ లో కొన్ని పాటలు పాడింది.ఈమె పాడిన ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ తెలుగులో ఉన్నాయి. ఈమె మరణవార్త తెలిసిన తోటి సింగర్స్ దిగ్బంతి చెందారు. ఎంతో ఉన్నత భవిష్యత్ ఉంటుందన్న ఈ సింగర్ జీవితం ఇలా మధ్యలోనే ముగిసిపోవడంతో అందరు విచారణ వ్యక్తం చేస్తున్నారు. ఆమె మరణవార్త తెలిసిన వెంటనే ఆమె అభిమానులు ఆమె సన్నిహితులు ఒక్కసారిగా దిగ్బంతి చెందారు. ఆమె మరణానికి విచారిస్తూ సోషల్ మీడియా వేదికగా నివాళి అర్పిస్తున్నారు. మనం కూడా కామెంట్ రూపంలో ఆమె మృతికి నివాళి అర్పిద్దాం.