#RRRకు సవాల్ గా తెరపైకి మరో భారీ మల్టీస్టారర్..

56

బాహుబలి తర్వాత దర్శక ధీరుడు రాజమౌళిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ సినిమా తర్వాత రాజమౌళి ఏం చేస్తాడు అనే ప్లాన్‌తో ఎదురు చూస్తే భారీగా షాకిచ్చాడు. ఎన్టీఆర్, రాంచరణ్‌తో మల్టీస్టారర్ ప్లాన్ చేసి అభిమానులకు కిక్కించాడు. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్‌పై ఉంది.ఇది తెలుగు తమిళ్ హిందీ భాషలలో రిలీజ్ అవుతుంది.

రాజమౌళిపై భారీ అంచనాలతో

అయితే ఈ సినిమాకు పోటీగా ఇప్పుడు మరొక భారీ మల్టీస్టారర్ రాబోతుంది.క్రేజీ డైరెక్టర్ మణిరత్నం విజయ్ విక్రమ్ శింబులతో కలిసి ఒక మల్టీస్టారర్ తెరకెక్కించబోతున్నాడు.ప్రస్తుతం మణిరత్నం మల్టీస్టారర్ స్క్రిప్టు దశలో ఉన్నట్టు సమాచారం. తమిళంలో ప్రజాదరణ పొందిన నవల ఆధారంగా తెరకెక్కుతున్నట్టు తెలిసింది.

Image result for vijay vikram simbu film

ఈ చిత్రం మరో దళపతి లాంటి చిత్రం కావొచ్చని తమిళ వర్గాల్లో వినిపిస్తున్నది.అయితే ఆ ముగ్గురు హీరోలకు తెలుగులో కూడా మార్కెట్ ఉంది కాబట్టి ఇది #RRR కు పోటీగానే భావిస్తున్నారు.చూడాలి మరి ఈ రెండు భారీ మల్టీస్టారర్ లో ఏది ప్రజాదారణ పొందుతుందో.