మణికర్ణిక ట్రైలర్ : ఝాన్సీరాణిగా కంగనా రనౌత్ ఉగ్రరూపం

254

ఝాన్సీరాణి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చారిత్రాత్మక చిత్రం ‘మణికర్ణిక’. కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషించిన ఈచిత్రానికి క్రిష్ జాగర్లమూడి, కంగనా దర్శకత్వం వహించారు. నిర్మాత కమల్ జైన్ జీ స్టూడియోస్‌తో కలిసి దాదాపు 180 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగు రైటర్, బాహుబలి ఫేం విజయరేంద్రప్రసాద్ కథ అందించాడు. జనవరి 25న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

Image result for manikarnika

1857 ప్రాంతంలో బ్రిటిష్ వారికి ఎదురొడ్డి ఝాన్సీ లక్ష్మీభాయి పోరాటం జరిపిన తీరును ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నారు.మణికర్ణికగా జన్మించి ఆమె లక్ష్మిభాయిగా ఎలా మారింది. ఎలాంటి పరిస్థితుల్లో ఝాన్సీ రాణిగా బాధ్యతలు చేపట్టింది. తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి చేసిన సాహసాలు, తీసుకున్న నిర్ణయాలు ఇలా ప్రతి అంశం సినిమాలో చూపించబోతున్నారు.

ఈ సినిమా ట్రైలర్ ను ఈరోజు విడుదల చేశారు.నిజమైన ఝాన్సీ లక్ష్మీభాయి ఇలానే ఉంటుంది అనే స్థాయిలో కంగనా తన పాత్రకు జీవం పోసినట్లు కనిపిస్తోంది.కంగనా రనౌత్ బ్రిటిష్ సైన్యం తలలు తెగనరుకుతున్న సన్నివేశాలు ఒళ్లు గగుర్బొడేలా చూపించారు. హిందీతో పాటు తెలుగు, తమిళంలో కూడా ఈ మూవీ విడుదల చేసే అవకాశం ఉంది.