మనోజ్ ట్వీట్ వైరల్… #RRR లాంచ్‌లో ‘చిరుతో కలసి మూవీని లాంచ్ చేసిన నందమూరి హరికృష్ణ’ ..

338

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ చిత్రం ‘RRR’. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.ఈ చిత్రం ఆదివారం రోజు వైభవంగా లాంచ్ అయింది. చిత్ర టీం రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా, రాఘవేంద్ర రావు ఆథిధులుగా హాజరయ్యారు.

Image result for rrr movie launch

ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ కు పలువురు సెలెబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా మనోజ్ ఆర్ఆర్ఆర్ చిత్రానికి శుభాకాంక్షలు చేస్తూ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఆర్ఆర్ఆర్ చిత్ర లాంచ్ లో నందమూరి హరికృష్ణ ప్రత్యక్షమయ్యారు. ఇటీవల ప్రమాదంలో మరణించిన హరికృష్ణ గారి ఆశీస్సులు ఈ చిత్రానికి ఉంటాయని చెప్పడంలో అర్థం ఉంది. కానీ హరికృష్ణ ప్రత్యక్షం కావడం ఏంటని అనుకుంటున్నారా.. ప్రత్యక్షం కావడం మాత్రమే కాదు.. చిరంజీవితో కలసి ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని లాంచ్ చేశారు కూడా.అది ఎలా అంటారా.. ఇదంతా అభిమానులకే సాధ్యం.

ఫోటో షాప్ ద్వారా ఆర్ఆర్ఆర్ లాంచ్ లో హరికృష్ణ పాల్గొన్నట్లు అభిమానులు తయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.అంతే ఈ ఫోటో ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటోని జత చేసి మనోజ్ ట్వీట్ చేశాడు. అభిమానులు తయారు చేసిన ఈ ఫోటోని ఓ చోట చూశాను. చాలా బావుంది. ఆర్ఆర్ఆర్ టీంకు శుభాకాంక్షలు. ఆర్ఆర్ఆర్ సినిమా కాదు.. ఓ పండగ ప్రారంభమైంది అని మనోజ్ తెలిపాడు.