‘ఫసక్’ యాప్.. మంచు మనోజ్ ఫన్నీ ట్వీట్..

406

టాలీవుడ్ లో డైలాగ్‌లను విభిన్నంగా, త‌న‌దైన మేన‌రిజ‌మ్‌తో ప‌ల‌క‌డంలో కలెక్షన్ కింగ్ మోహ‌న్‌బాబుది విల‌క్షణ శైలి. ర‌చ‌యిత రాసిన ఓ సాధార‌ణ‌ డైలాగ్‌ను కూడా త‌న‌దైన శైలిలో ప‌లికి దానికి ప్రాచుర్యం తీసుకురావ‌డంలో మోహ‌న్‌బాబు తర్వాతే ఎవరైనా.ఎస్వీఆర్ తర్వాత ఆ రేంజ్ లో డైలాగ్ చెప్పేది మోహన్ బాబే.

manchu mohan babu కోసం చిత్ర ఫలితం

అయితే ఇటీవ‌ల ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో త‌న డైలాగ్‌ల గురించి మోహ‌న్‌బాబు మాట్లాడుతూ గ‌తంలో త‌ను న‌టించిన ‘ఎం. ధ‌ర్మరాజు ఎంఏ’ సినిమాలోని ఓ డైలాగ్‌ను ఇంగ్లీష్‌లోకి త‌ర్జుమా చేసి చెప్పారు.ఆ సంద‌ర్భంలో ‘ఫ‌స‌క్’ అనే ప‌దాన్ని వాడారు. దీంతో ఆ పదం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిపోయింది. ఈ ప‌దం ఆధారంగా సోష‌ల్ మీడియాలో బోలెడ‌న్ని స్పూఫ్‌లు, ఫ‌న్నీ వీడియోలు వ‌చ్చాయి.

manchu manoj కోసం చిత్ర ఫలితం

అయితే ఇప్పుడు ఏకంగా ఒక యాప్ కూడా వచ్చేసింది. ఈ పదానికి సోషల్ మీడియాలో మరింత ప్రాచుర్యం కల్పించాడు మంచు మనోజ్.ఈ యాప్ గురించి తెలుసుకున్న మనోజ్ షాక్ అయ్యాడు. దీని గురించి ఓ నెటిజన్ ట్విటర్‌లో మనోజ్‌కు తెలియజేస్తే.. అది చూసి.. నవ్వుతూ ‘అప్పుడే యాప్ కూడానా’ అని రీట్వీట్ చేశాడు.