‘బిగ్‌బాస్’ విన్నర్ ఎవరో చెప్పేసిన మంచు మనోజ్

411

తెలుగు బిగ్‌బాస్ సీజన్ 2 రోజురోజుకీ రసవత్తరంగా మారుతోంది. హౌస్‌మేట్స్ అంతా కలిసి ప్రేక్షకులకు కావల్సినంత మసాలా అందిస్తున్నారు. అయితే బిగ్‌బాస్ ఇంకో రెండు వారాల్లో ముగియనుంది. బిగ్‌బాస్ విన్నర్ ఎవరు? అనే దానిపై చాలా ఆసక్తి నెలకొంది. ఒకరకంగా చెప్పాలంటే.. రోల్ ‌రైడా, సామ్రాట్ మినహా మిగిలిన వారంతా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌గానే కనిపిస్తున్నారు.గీతా మాధురి విషయానికి వస్తే ఆమె ఫిజికల్ టాస్క్స్ విషయంలో చాలా వీక్.అలాగే దీప్తి కూడా చాలా వీక్.

Image result for big boss2 telugu

స్ట్రాంగ్ గా ఉన్నదీ అంటే తనీష్,కౌశల్ అనే చెప్పుకోవాలి.వీళ్ళిద్దరిలోనే ఎవరో ఒకరు గెలిచే అవకాశం ఉంది.కౌశల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ఎందుకంటే అతనికి బయట కౌశల్ ఆర్మీ అనేది ఉంది. అయితే ఇప్పుడు గేమ్ మొత్తం ప్రేక్షకుల చేతుల్లోకి వెళ్లిపోయింది. విన్నర్‌ని డిసైడ్ చేసేంది ప్రేక్షకులే. ఏ కంటెస్టెంట్‌కి ఓట్లు ఎక్కువగా వేస్తారో వారే విన్నర్. అయితే విన్నర్ ఎవరవుతారు? అనే విషయమై ఓ నెటిజన్ ట్విటర్ ద్వారా మంచు మనోజ్‌ను ప్రశ్నించాడు.

Image result for manoj manchu

 

దీనికి మనోజ్ ఎవరూ ఊహించని ఆన్సర్ ఇచ్చాడు. ‘గుడ్ మార్నింగ్ అన్నా. నీ అభిప్రాయం ప్రకారం బిగ్‌బాస్ తెలుగు 2 విన్నర్ ఎవరు?’ అని ఓ నెటిజన్ మనోజ్‌ని ప్రశ్నించగా ‘నాని’ అంటూ ఎప్పటిలాగే చిలిపి సమాధానమిచ్చాడు మనోజ్.