జనసేన పార్టీకి ఊహించని షాక్ ఇచ్చిన మంచు మనోజ్

492

తెలుగు రాష్టాలలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి.అందుకే రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థుల మీద ఫోకస్ పెట్టాయి.ఎవరు డబ్బు ఖర్చు పెట్టగలరు ఎవరు ఎక్కువ ప్రచారం చెయ్యగలరు ఎవరు గట్టి పోటీదారుడు అన్న పద్దతిలో పార్టీలు నాయకులను చూసుకుంటుంటే జనసేన పార్టీ మాత్రం ఎవరికీ ప్రజా సేవ చేస్తారు.ఎవరు పార్టీకి మంచి అన్న ధోరణిలో నాయకులను ఎంచుకుంటున్నారు.ఈసారి కొత్తవారికి ఛాన్స్ ఇవ్వాలని జనసేన క్యాడర్ అనుకుంటుంది. ఆ విధంగానే పార్టీ పనులు నడుస్తున్నాయి.

Image result for janasena

పదవి ముఖ్యం కాదు మనకు ప్రజలకు మంచి చేసేవాళ్ళు పార్టీలు జంప్ అయ్యే వాళ్ళు మనకు వద్దని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాడు.అలాంటి వారి కోసమే పవన్ అన్వేషిస్తున్నాడు.అయితే ఇప్పుడు రాజకీయాల్లో ఒక ముఖ్యమైన వార్త హల్చల్ చేస్తుంది.మరి అదేమిటో చూద్దామా.సోషల్ మీడియాలో వస్తున్న ఒక వార్త జనసైనికులను పవన్ కళ్యాణ్ అభిమానులకు ఊపు తెచ్చేలా ఉంది.టాలీవుడ్ నుంచి చాలా మంది తారలు ఈసారి జనసేన నుంచి పోటీ చేసే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతుంది.పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు చాలా మంది సోషల్ మీడియాలో విష్ చేశారు.ఇందులో మంచు మనోజ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఆసక్తిగా మారాయి.మంచు మనోజ్ కు సామాజిక దృక్పధం ఎక్కువగా ఉంటుంది.విశాఖ హుదుద్ సమాయంలో నేరుగా ప్రజలలోకి వచ్చి సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్నారు.

Related image

వైజాగ్ ప్రజలకు మనోధైర్యాన్ని కలిగించారు.అలాగే రాష్టంలో ఎక్కడ ఏ సమస్య వచ్చిన మనోజ్ తనదైన శైలిలో స్పందిస్తారు.అలాగే రాజకీయనాయకులు చేసే తప్పులను చూపిస్తూ నేరుగా పాయింట్ అవుట్ చేస్తూ ఉంటాడు.ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తి సినిమాలో కంటే రాజకీయాల్లో ఉంటె మంచిదనే అభిప్రాయం సోషల్ మీడియాలో జోరుగా వినిపించడంతో పాటు వచ్చే ఎన్నికలలో జనసేన పార్టీ తరుపున మనోజ్ పోటీ చేస్తున్నాడని త్వరలో రాజకీయ అరంగ్రేటం ఉంటుందనే వార్త రాజకీయవర్గాలలో బలంగా వినిపిస్తుంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

పవన్ కళ్యాణ్ కూడా మనోజ్ ను జనసేనలోకి చేర్చుకోడానికి ఆసక్తిగా ఉన్నాడని తెలుస్తుంది.మోహన్ బాబు కూడా వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తానేమో అని చెప్పాడు.దీనిని బట్టి చూస్తే తండ్రి కొడుకులు జనసేనకు తోడుగా ఉండొచ్చని తెలుస్తుంది.మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. చూడాలి మరి ఏం జరుగుతుందో.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.జనసేనలోకి మంచు ఫ్యామిలీ వస్తే మంచిదేనా..పవన్ కు గెలిచే అవకాశాలు ఇంకా ఎక్కువ అవుతాయా..మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.