మంచు మనోజ్ ఫన్నీ ట్వీట్ .. ఇండియన్ ఫసక్ అంటే ఇది

283

ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయినా సంఘటన ఏదైనా ఉందంటే అది మంచు వారి ఫసక్ అన్న వీడియోనే.మోహన్ బాబు ఆ పదం చెప్పిన విధానం చాలా మందికి నచ్చింది.కొందరికి మాత్రం ఫన్నీగా అనిపించింది.అందుకే ఆ వీడియో మీద చాలా రకాల ఫన్నీ వీడియోలు వచ్చాయి.అయితే వాటిని ఆయన కొడుకులు లైట్ గా తీసుకున్నట్టు మనకు అర్థం అవుతుంది.

Image result for manchu mohan babu

ఎందుకంటే ఆ డైలాగ్ మీద వచ్చిన ప్రతి దానికి మంచు మనోజ్ కామెంట్స్ చేస్తున్నాడు. ఎప్పుడూ సరదా సరదా ట్వీట్స్‌తో నెటిజన్లను ఆకట్టుకునే మంచు మనోజ్ మరో ఫన్నీ ట్వీట్‌తో కడుపుబ్బ నవ్విస్తున్నాడు. ఒక వ్యక్తి ఫోర్క్‌తో నూడిల్స్‌ను తీసుకుని వాటిని కట్ చేసి తింటున్న వీడియోను మంచు మనోజ్ పోస్ట్ చేశాడు.

‘‘ఇప్పుడు నూడిల్స్ ప్రాబ్లమ్. ఇది ఓ ఇండియన్ ఫసక్. పెద్ద సమస్య సాల్వ్ అయింది’’ అని ట్వీట్‌లో పేర్కొన్నాడు. ‘నూడిల్స్ తినే విధానం ఇదా.. నాకిప్పుడు తెలిసింది’ అని ఒకరు.. ‘అయ్య బాబోయ్ దారుణమైన జోక్ ఇది’ అని మరొకరు. ఇలా రకరకాలుగా స్పందిస్తూ సందడి సందడి చేస్తున్నారు.