కేటీఆర్‌ను కలిసిన మళయాళ మెగాస్టార్ మమ్ముట్టి..ఎందుకో చూడండి..

457

మలయాళం సూపర్ స్టార్ మమ్మూట్టి శుక్రవారం (జులై 20) తెలంగాణ పంచాయతీ, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ను కలిశారు. సీఎం క్యాంప్ ఆఫీస్‌లో వీరిరువురి భేటీ జరిగింది.

ఈ నెల 25న హైదరాబాద్‌లో జరిగే ‘కైరాలి పీపుల్ ఇన్నోటెక్ అవార్డ్స్’ కార్యక్రమానికి కేటీఆర్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.ఈ ఆహ్వానానికి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు.ఈ విషయాన్ని కేటీఆర్ ట్విటర్‌లో తెలిపారు.

కాగా మమ్ముట్టి … మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘యాత్ర’ చిత్రంలో వైఎస్సార్ పాత్ర పోషిస్తున్నారు. ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్‌ మహి వి రాఘవ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే.

ఇటీవలే వైఎస్సార్ జయంతి సందర్భంగా చిత్ర యూనిట్ టీజర్‌ విడుదల చేయగా.. వైఎస్సార్‌ పాత్రలో మమ్ముట్టి ఒదిగిపోవడంతో విశేష ప్రేక్షకాదరణ లభిస్తోంది.