ఎన్టీఆర్ బయోపిక్‌లో ఛాన్స్ దక్కించుకున్న మరో యంగ్ హీరోయిన్..ఎవరి పాత్రలో అంటే?

283

మాజీ ముఖ్యమంత్రి, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ దివంగత ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్’ .క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు.బాలయ్య నిర్మిస్తున్నాడు.ఇందులో ఎన్టీఆర్ పాత్రను బాలయ్య పోషిస్తుండగా ఎన్టీఆర్ సతీమని బసవతారకం పాత్రలో విద్యా బాలన్, చంద్రబాబు నాయుడు పాత్రలో రానా, అక్కినేని పాత్రలో సుమంత్ ,హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

Image result for ntr biopic balakrishna

ఎన్టీఆర్ నట జీవితాన్ని ఎన్టీఆర్ కథానాయకుడిగా, రాజకీయ జీవితం ఆధారంగా ఎన్టీఆర్ మహానాయకుడిగా వెండితెరపై చూపించనున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ నట, రాజకీయ జీవితంలో ఆయనతో సంబంధమున్న కీలక పాత్రలను తెరకెక్కించారు.ఈ చిత్రానికి సంబంధించి రోజుకో ఆసక్తికర విషయం వెలుగులోకి వస్తోంది.ఇప్పుడు మరొక వార్త హల్చల్ చేస్తుంది.

Related image

ఈ సినిమాలో ఒక యంగ్ హీరోయిన్ నటించబోతుందని వార్తలు వచ్చాయి.అలనాటి నటి కృష్ణ కుమారి పాత్ర కోసం మలయాళీ బ్యూటీ మాళవిక నైర్ ని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్, కృష్ణ కుమారి కలసి పలు చిత్రాల్లో నటించారు. అప్పట్లో కృష్ణ కుమారి దేవతల పాత్రలతో బాగా పాపులర్ అయ్యారు.