మహేష్ బాబు మహర్షి వీడియో వైరల్

159

మహేష్‌ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమా తీస్తున్న సంగతి మనకు తెలుసు. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో యంగ్ హీరో అల్లరి నరేష్‌ కీలక పాత్రలో కనిపించనున్నాడు. దిల్ రాజ్ మరియు ప్రసాద్ పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

పొల్లాచ్చిలో తాజాగా షూటింగ్‌ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఇక ఫిబ్రవరి మొదటి వారంలో హైదరాబాద్‌లో మరో షెడ్యూల్‌కు చితృ యూనిట్‌ ప్లాన్‌ చేసింది. ఇప్పటికే విడుదల అయినా మహేష్ న్యూలుక్‌కు సూపర్బ్‌ రెస్పాన్స్‌ వచ్చింది.

తాజాగా ‘మహర్షి’ సినిమా షూటింగ్‌కు సంబంధించిన కొన్ని వీడియోలు, ఫోటోలు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. పచ్చని పొలాల్లో మ‌హేష్ మీడియాతో మాట్లాడుతున్నట్టు ఒక పిక్ ఉండ‌గా, షూటింగ్‌ లొకేషన్స్‌కు సంబంధించిన మరో వీడియో ఉంది. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఏప్రిల్ 25న రిలీజ్ చేయనున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.