మహేష్ మహర్షి కోసం ఏకంగా విలేజిని నిర్మించారు..

311

ప్రస్తుతం మహేష్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహర్షి’.ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.దిల్ రాజు ప్రసాద్ పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.దేవిశ్రీ ప్రసాద్ మ్యూజి అందిస్తున్నాడు. ఇది మహేశ్‌ 25వ చిత్రం.

Related image

ఇప్పటికే విడుదల చేసిన టీజర్ తో సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.మహేష్ బాబు లుక్ కొత్తగా ఉండడంతో అభిమానులు సంబరపడిపోతున్నారు.అయితే ఈ చిత్ర షూటింగ్ త్వరలో హైదరాబాద్‌లో జరగనుంది. కొద్ది రోజులుగా అమెరికాలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ హైదరాబాద్‌లో జరగనుంది.

Image result for చిత్రం ‘మహర్షి’

గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ భారీ షెడ్యూల్ కోసం ఓ పెద్ద విలేజ్ సెట్ సిద్ధమైపోయింది. ఈ షెడ్యూల్‌లో మహేశ్, పూజ, అల్లరి నరేష్ తదితరులపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.సమ్మర్ కు ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది.