అల్లు అర‌వింద్ పై క‌త్తి మహేష్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

913

కత్తి మహేశ్‌కు, పవన్ ఫ్యాన్స్‌కు మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. పవన్ ఫ్యాన్స్‌పై రోజూ విరుచుకుపడుతున్న కత్తి మహేశ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. అతనిని విమర్శిస్తూ ఫొటోలు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. పందితో కత్తి మహేశ్‌ను పోల్చుతన్న ఫోటోలు సోష‌ల్ మీడియాలో విపరీతంగా హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ఫోటోల‌పై క‌త్తి మ‌హేష్ విరుచుకుప‌డ్డాడు.

ఈ క్రింది వీడియో చూడండి.

 

మహేష్‌కు పవన్ ఫ్యాన్స్ కత్తి మ‌హేష్ పై దుమ్మెత్తిపోస్తున్న నేపథ్యంలో ఆయన తాజాగా త‌న ఫేస్ బుక్ ఘాతాలో పెట్టిన పోస్ట్ పుండు మీద కారం చల్లినట్టుంది. సోషల్‌ మీడియాలో పవన్‌ అభిమానుల నుంచి దారుణమైన తిట్లు ఎదుర్కొంటున్నానన్న మహేశ్‌.. వాటికి సంబంధించిన‌ రెండు స్క్రీన్‌ షాట్లను పోస్ట్ చేశాడు. తన ఫేస్‌బుక్ ఫ్రెండ్స్‌లో చాలామంది పవన్ ఫ్యాన్స్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయమని సలహా ఇస్తున్నారని కత్తి మహేశ్ చెప్పాడు. అయితే తనను బెదిరిస్తున్న వారిలో చాలామంది టీనేజర్లే ఉన్నారని, అందుకే వారి పిచ్చిని చూసి జాలిపడుతున్నానని పోస్ట్ పెట్టాడు.

Image result for kathi mahesh

పిల్లల మీద కేసులు పెట్టడానికి నా మనసు అంగీకరించట్లేదు. ఇన్‌ఫ్యాక్ట్‌ వాళ్లను చూస్తే జాలేస్తుందన్నారు.ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్ పై క‌త్తి మహేశ్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పీకే ఒక వైరస్‌. హెచ్‌ఐవీ కంటే ప్రమాదకారిలా యువతరాలను బలితీసుకుంటున్నాడు. ఆయనను అనుసరిస్తూ హేతుబద్ధమైన ప్రవర్తన, సామాజిక బాధ్యతలను మర్చిపోతున్నారు. ఈ రుగ్మతకు చట్టబద్ధమైన పరిష్కారం కంటే సామాజిక చికిత్స అవసరం అని కత్తి మహేశ్‌ అన్నారు.

Image result for allu aravind

ఈ సంద‌ర్బంగా ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్‌ అధినేత అల్లు అరవింద్‌పై కూడా మహేశ్‌ కత్తి సంచలన ఆరోపణలు చేశారు. గీతా ఆర్ట్స్‌ ఆఫీసు నుంచే తనపై వికృత ప్రచారం సాగుతున్నదని, పవన్‌ అభిమానులకు తన ఫోన్‌ నంబర్‌​ షేర్‌ అయింది కూడా అక్కడి నుంచేనని తెలిపారు.

Image result for allu aravind

గీతా ఆర్ట్స్‌ ఆఫీసు కేంద్రంగా నన్ను పందితో పోల్చుతూ ఇటీవల పుట్టుకొచ్చిన ఫేస్‌బుక్‌ పేజీల్లో అధికభాగం గీతా ఆర్ట్స్‌ ఆఫీసులోనే క్రియేట్‌ అయ్యాయని తెలిసింది. ఈ విషయంలో ఆ ఆఫీసు అధినేత అల్లు అరవింద్‌ తక్షణమే చర్యలు తీసుకొని, వికృత ప్రచారాన్ని ఆపేయాలి.

Image result for pavan

తిట్టమని కోరుతూ పవన్‌ అభిమానులకు నా ఫోన్‌ నంబర్‌ షేర్‌ అయింది కూడా ఈ ఆఫీసు నుంచే.నిజానికి అల్లు అరవింద్‌తో నాకు వ్యక్తిగతంగా ఎలాంటి విబేధాలు లేవు. వికృతపర్వాల సంగతి ఆయనకు తెలిసి ఉంటే గనుక అలాంటి శునకానందానికి దూరంగా ఉండాలని కోరుతున్నాఅని కత్తి మహేశ్ త‌న ఫేస్ బుక్ లో చేసిన పోస్ట్ సంచ‌ల‌నంగా మారింది.