మరో బయోపిక్‌లో మహేష్ బాబు హీరోయిన్‌ కిరా అద్వానీ..

406

టాలీవుడ్ లో భరత్‌ అనే నేను సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ కియారా అద్వానీ.తొలి సినిమా మహేష్ బాబు పక్కన నటించడం వలన ఆమె పేరు అంతటా మారుమోగిపోయింది. తొలి సినిమాతోనే తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ అవుతున్నారు. ఇప్పటికే బోయపాటి శ్రీను, రామ్ చరణ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న కైరా మరిన్ని సినిమాలకు రెడీ అవుతున్నారు.

టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ సత్తా చాటుతున్నారు కియారా.ఇప్పటికే బాలీవుడ్ లో ధోనీ లవ్ స్టోరీస్ లాంటి సినిమాలు చేసింది.ధోని బయోపిక్‌తో బాలీవుడ్‌ లో గుర్తింపు తెచ్చుకున్న కియారా ఇటీవల లస్ట్‌స్టోరిస్‌ తో సెన్సేషన్‌ సృష్టించారు.ధోనీ బయోపిక్ లో ఆమె నటనకు అందరు ఫిదా అయ్యారు.

 

ఇప్పుడు కైరా అద్వానీ మరో బయోపిక్‌ లో నటించేందుకు ఓకె చెప్పారు. పరమవీర చక్ర సాధించిన అమర జవాన్‌ విక్రమ్‌ బాత్రా జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో కియారా కీలక పాత్రలో నటించనున్నారు. సిద్ధార్థ్‌ మల్హోత్ర హీరోగా నటిస్తున్న ఈ సినిమాను కరణ్ జోహర్‌ నిర్మిస్తున్నాడు.