గీతా ఆర్ట్స్ లో మహేష్ బాబు సినిమా..దర్శకుడు ఎవరు చూడండి…

468

మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పైన ప‌లు భారీ చిత్రాల‌ను నిర్మించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు సెన్సేష‌నల్ మూవీని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నార‌ని ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది.ఒక భారీ సినిమా నిర్మించేందుకు ప‌క్కా ప్లాన్ రెడీ చేస్తున్నార‌ని టాక్ వినిపిస్తోంది.ఈసారి సూప‌ర్ స్టార్‌తో మూవీ ప్లాన్ చేస్తున్నార‌ట‌.

Image result for mahesh babu allu aravind

అవును..సూపర్ స్టార్ మ‌హేష్ బాబుతో అల్లు అర‌వింద్ ఓ భారీ సినిమా నిర్మించాల‌నుకుంటున్నార‌ట‌. ఈ సినిమాకి సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నార‌ని తెలిసింది. ప్ర‌స్తుతం సందీప్ రెడ్డి, అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ చేస్తున్నారు. మ‌హేష్ బాబు వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హ‌ర్షి మూవీ చేస్తున్నారు. ఆ త‌ర్వాత సుకుమార్‌తో సినిమా చేయ‌నున్నాడు.

Image result for mahesh babu sandeep vanga

దీని తర్వాత సందీప్‌తో సినిమా స్టార్ట్ కానుంద‌ని స‌మాచారం. మ‌రి మ‌హేష్ – సందీప్ రెడ్డి మూవీని గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్లో అల్లు అర‌వింద్ నిర్మిస్తే సంచ‌ల‌న‌మే కదా.చూడాలి విజయ్ దేవరకొండను ఒక రేంజ్ లో చూపించిన సందీప్ మహేష్ ను ఎలా చూపిస్తాడో చూడాలి.