మేడమ్ టుస్సాడ్స్ లో మహేష్ బాబు విగ్రహంను ఎలా తయరుచేస్తున్నారో చూడండి..

401

ప్రముఖుల మైనపు బొమ్మలను మేడం టుస్సాడ్ లో పెడతారని మన అందరికి తెలిసిందే.ఇప్పుడు ఈ అవకాశం మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కు వచ్చింది.పలువురు కళాకారులు ఆయన విగ్రహం తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటి వరకు తలభాగానికి సంబంధించిన పార్ట్ తయారైంది.

ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.తల భాగం వరకు తయారైన విగ్రహాన్ని ఈ ఫోటోలో చూడొచ్చు. త్వరలోనే మహేష్ బాబు పూర్తి విగ్రహం సిద్ధం కాబోతోంది. ఇవాన్ రీస్ అనే ఆర్టిస్ట్ ఈ విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ప్రతినిధులు ఏప్రిల్ మాసంలో మహేష్ బాబు ఇంటికి వచ్చి ఆయనకు సంబంధించిన కొలతలు తీసుకెళ్లారు.

ఈ విషయం గురించి తెలియజేస్తూ మహేష్ బాబు ట్వీట్ చేసాడు. మేడం టుస్సాడ్ మ్యూజియంలో తాను కూడా భాగమైనందుకు సంతోషంగా ఉందని మహేష్ బాబు తెలిపాడు. మైనపు విగ్రహం నెలకొల్పడానికి వివరాలు సేకరించిన మేడం టుస్సాడ్ కళాకారులకు మహేష్ బాబు థాంక్స్ చెప్పాడు.