క్రేజీ కాంబినేషన్ : విజయ్ హీరోగా విలన్‌గా మహేష్ బాబు సినిమా ..

327

ప్రస్తుతం దక్షిణాది సినిమాలో మల్టీస్టారర్ల హవా నడుస్తోంది. మంచి క్రేజ్ ఉన్న హీరోలు కలిసి నటిస్తూ సినీ పరిశ్రమలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పెంపొదిస్తున్నారు. ఇప్పుడు మరో క్రేజీ కాంబినేషన్ తెరపైకి వచ్చింది. తమిళ స్టార్ హీరో విజయ్ , తెలుగు సూపర్ స్టార్ మహేష్‌బాబు కలిసి నటించబోతున్నారనే వార్త గతంలో హల్‌చల్ చేసింది.

Image result for mahesh babu vijay

తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి నిర్మితమయ్యే ఈ సినిమాలో తమిళంలో విజయ్ హీరోగా మహేష్ విలన్‌గా, తెలుగులో మహేష్ హీరోగా విజయ్ విలన్‌గా నటిస్తారని అప్పట్లో అన్నారు.ఈ సినిమాను ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వం వహిస్తారని వార్తలు వచ్చాయి.అయితే దీనిపై అధికార ప్రకటన రాలేదు. అయితే, ఇప్పుడు ఈ వార్త మరోసారి తెరపైకి వచ్చింది. విజయ్ సినిమాలో మహేష్ విలన్‌గా నటించబోతున్నారని తమిళనాట ప్రచారం జరుగుతోంది.

విజయ్, మహేష్‌కు మురుగదాస్ కథ చెప్పారని, అది నచ్చడంతో ఈ ఇద్దరు హీరోలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. అయితే తన సినిమాలో మహేష్‌బాబు విలన్‌గా నటిస్తేనే ఈ సినిమా చేస్తానని విజయ్ మురుగదాస్‌కు చెప్పారట. దీంతో తెలుగులో విజయ్ విలన్‌గా, తమిళంలో మహేష్ విలన్‌గా నటించేలా ఇద్దరు హీరోలను మురుగదాస్ ఒప్పించారని అంటున్నారు. దీనిలో నిజమెంతో తెలియదు కానీ ప్రచారం అయితే మాత్రం బాగా జరుగుతోంది.