కొత్త బిజినెస్‌ స్టార్ట్ చేసిన సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు

342

టాలీవుడ్ లో సూపర్‌స్టార్ అంటే మనకు గుర్తుకువచ్చే పేరు మహేష్ బాబు.టాలీవుడ్ లో నెంబర్ 1 రేస్ లో ఉన్న ఈ హీరో ఇప్పుడు మరొక రంగంలోకి అడుగుపెడుతున్నారు.మహేష్‌ బాబు ఓ కొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టారు.

Related image

ఇప్పటికే మహేష్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, విశాఖపట్నం ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే.ఆ బిజినెస్ ల ద్వారా చాలా సంపాదిస్తున్న మహేష్ బాబు ఇప్పుడు మరొక రంగంలోకి దిగి సంపాదించే పనిలో ఉన్నాడు.తాజాగా ఆయన మల్టీప్లెక్స్ రంగంలోకి అడుగుపెడుతున్నారు.

ఏషియన్ ఫిలిమ్స్‌తో కలిసి హైదరాబాద్‌లోని పలు చోట్ల మల్టీప్లెక్స్ థియేటర్‌లు నిర్మిస్తున్నారు.తాజాగా మహేష్ మల్టీప్లెక్స్‌ థియేటర్లకు సంబంధించిన లోగో సోషల్‌మీడియాలో విడుదలైంది. ‘‘ఏఎంబీ సినిమా’’ పేరుతో ఈ లోగోని విడుదల చేశారు. ఏఎంబీ అంటే.. ‘ఏషియన్ మహేష్‌ బాబు సినిమాస్’.మరి ఈ బిజినెస్ లో మహేష్ రాణించాలని కోరుకుందాం.