ప్రొడ్యూసర్ గా మారిన మహేష్ బాబు

202

టాలీవుడ్ లో నెంబర్ హీరో ఎవరంటే ఠక్కున చెప్పే పేరు మహేష్ బాబు. టాలీవుడ్ కు ఆయనే ఇప్పుడు సూపర్ స్టార్. అమ్మాయిలకు రాకుమారుడు ఆయనే. ప్రొడ్యూసర్స్ కు కొంగు బంగారంగా మారిన మహేష్ ఇప్పుడు ప్రొడ్యూసర్ గా మారుతున్నాడు.

Image result for mahesh babu

ఇప్పటికే AMB అనే సినీ మల్టిప్లెక్స్ ను ఏర్పాటుచేసి మంచి బిజినెస్ మ్యాన్ అని అనిపించుకుంటున్నాడు. ఇప్పుడు ప్రొడ్యూసర్ అవతారం ఎత్తబోతున్నాడు. అయితే సినిమా నిర్మాతగా అయితే కాదులెండి. మహేష్ ఓ వెబ్ సిరీస్‌ను నిర్మించబోతున్నాడు.

Image result for mahesh babu

జియో ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి వెబ్ సిరీస్‌కు ప్లాన్ చేస్తున్నాడు. దీనికి ‘ఛార్లీ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ‘నాన్నకు ప్రేమతో’ చిత్రానికి రచయితగా పనిచేసిన హుస్సేన్ షా కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక మహేష్ నిర్మాణంలో తెరకెక్కనున్న వెబ్ సిరీస్ అంటే క్రేజ్ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.